Eye Test: మీది డేగ చూపైతే మీకో సవాల్.. ఈ ఫోటోలో ఉన్న 8వ వ్యక్తిని కనిపెట్టండి చూద్దాం!
ABN, Publish Date - Jan 23 , 2024 | 04:13 PM
దీన్ని సులువుగా సాల్వ్ చేసినవారి చూపు డేగ లెక్క ఉన్నట్టే అని అంటున్నారు.
చిన్నతనంలో చెప్పుకోండి చూద్దాం, కనిపెట్టండి చూద్దాం వంటివి విరివిగా చేసేవారు. అవన్నీ టెక్నాలజీతో పాటూ అప్డేట్ అయ్యి ఇప్పుడు ఆప్టికల్ ఇల్యూసన్ గా మార్పు చెందాయి. మెదడును అయోమయానికి గురి చేసే ఈ దృష్టి భ్రాంతి చిత్రాలు సాల్వ్ చేస్తే మెదడు పనితీరు, కంటి చూపు రెండూ పదునెక్కుతాయట. వీటిని సులువుగా సాల్వ్ చేసినవారి చూపు డేగ లెక్క ఉన్నట్టే అని అంటున్నారు. ఇలా కంటికి పనిపెట్టే ఓ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీని వైపు ఓ లుక్కేస్తే..
సోషల్ మీడియాలో ఓ ఫ్యామిలీ ఫోటో(Family Photo) వైరల్ అవుతోంది. ఈ ఫోటోలో తల్లిదండ్రి, వారి పిల్లలు అందరూ ఉన్నారు. ఫోటోలో ఉన్న మనుషులను లెక్కించగా 7 మంది ఉన్నారు. అయితే ఈ ఫోటోలో మరొక వ్యక్తి ఉన్నారని. ఆ వ్యక్తి 8వ కుటుంబ సభ్యులని అంటున్నారు. సరిగ్గా గమనిస్తే ఫోటోలో ఎక్కడా 8వ వ్యక్తి కనిపించరు. ఫ్యామిలీ మధ్యలోనూ, చుట్టుప్రక్కలా ఎక్కడా 8వ వ్యక్తి జాడలేదు. అయితే ఈ ఎనిమిదవ వ్యక్తిని కనిపెట్టిన వారికి నిజంగా డేగచూపు ఉన్నట్టేనని సర్టిపై చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Viral Video: బాబోయ్.. పప్పు చేయడానికి ఇన్ని తిప్పలా? వీళ్ల టెక్నిక్ చూస్తే మైండ్ బ్లాకవ్వాల్సిందే..!
సరిగ్గా గమనిస్తే కుటుంబ సభ్యులు అందరూ చిరునవ్వులు చిందిస్తూ పోటోలో కనబడతారు. ఎనిమిదవ వ్యక్తి కోసం వెతుకుతుండగా వెనుక గోడకు వేలాడుతున్న ఫోటో కనిపిస్తుంది. ఈ ఫోటోలో ఒక వ్యక్తి ఉండటం చూడచ్చు. ఆ ఇంటి కుటుంబ సభ్యుడో, మరణించిన ఇంటి పెద్దో ఆ ఫోటోలో ఉన్నారు. ఫోటోలో ఉన్న ఇతనితో కలిసి మొత్తం 8మంది సరిపోతారు.
ఇది కూడా చదవండి: మీకూ ఈ లక్షణాలుంటే.. ఈ విటమిన్ల లోపం ఉన్నట్టే లెక్క!
మరిన్ని ప్రత్యేక వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.
Updated Date - Jan 23 , 2024 | 04:13 PM