Foot Shape: పాదాల ఆకారాన్ని బట్టి వ్యక్తిత్వాన్ని చెప్పేయచ్చా? పర్సనాలిటీ టెస్ట్ ఏం చెబుతోందంటే..!
ABN, Publish Date - Jan 26 , 2024 | 02:17 PM
కాలి పాదాల ఆకారం చూసి కూడా వ్యక్తిత్వాన్ని చెప్పవచ్చని అంటున్నారు. ఈ రెండు ఆకారాలలో మీ పాదం ఎలాంటిది? ఓసారి చెక్ చేసుకోండి.
మనిషి శరీరాన్ని బట్టి వాళ్ల వ్యక్తిత్వం ఎలాంటిది అని కొందరు చెబుతుంటారు. పడుకునే విధానం, నిలబడే విధానం, నడిచే విధానం, హెయిర్ స్టైల్ చేసుకునే తీరు, కూర్చునే విధానం ఇలా చాలా వ్యక్తిత్వాన్ని వ్యక్తం చేస్తాయని అంటారు. ఇవన్నీ మనిషిలో ఉండే భావోద్వేగాలు, వారి ప్రవర్తనను వ్యక్తం చేస్తాయని చెబుతారు. మంచు మనోజ్, సదా నటించిన దొంగ దొంగది సినిమా చాలామందికి గుర్తుండే ఉంటుంది. అందులో హీరోయిన్ కాలి వేళ్లు చూసి గయ్యాళి అనే చెప్పడం చూస్తే కామెడీ అనిపిస్తుంది. కానీ నిజంగానే ఇలా శరీర భాగాలను చూసి వారి వ్యక్తిత్వం చెప్పేయవచ్చట. ఇదే విధంగానే కాలి పాదాల ఆకారం చూసి కూడా వ్యక్తిత్వాన్ని చెప్పవచ్చని అంటున్నారు. సాధారణంగా పాదాల ఆకారంలో రెండు రకాలు ఉంటాయి. వీటిలో ఒకటి రోమన్ ఫుట్ ఆకారం కాగా.. రెండవది గ్రీక్ ఫుట్ ఆకారం..
రోమన్ ఫుట్ ఆకారం ఉన్నవారి వ్యక్తిత్వ లక్షణాలు..
రోమన్ ఫుట్ ఆకారం పాదాలు ఉన్నవారు స్వేచ్చగా ఉంటారట. కొత్త వ్యక్తులను కలవడం, పరిచయాలు పెంచుకోవడం, తమ పరిచయస్తుల సర్కిల్ ను పెంచుకోవడం, ఆత్మవిశ్వాసంతో ఉండటం వీరిలో ఉంటాయట. వీరి పనితీరు అద్బుతంగా ఉంటుంది, నిర్భయంగా తాము అనుకున్న పనులు చేస్తారు. ఎప్పుడూ కొత్త స్పూర్తితో ముందడుగు వేస్తారు.
అయితే వీరి మొండితనం, వెనకడుగు వేయని తత్త్వం వీరికి గొడవలు కూడా తెచ్చిపెడుతుంది. ఇక వ్యక్తిగత విషయాలలో కూడా ఎప్పుడూ బాధ్యతగా ఉంటారు. క్రీడలు, వ్యాపారం, అథ్లెటిక్స్, కళలలో వీరి ప్రతిభ ఇనుమడిస్తుంది. వీరికంటూ ఉండే ఓ ప్రత్యేక శైలి వీరిని సెంటరాఫ్ అట్రాక్షన్ గా నిలబెడుతుంది.
ఇది కూడా చదవండి: బెల్లం టీ గురించి మీకు తెలియని నిజాలివీ..!
గ్రీక్ ఫుట్ షేప్..
గ్రీక్ ఫుట్ షేప్ పాదాలు ఉన్నవారిలో సృజనాత్మకత ఎక్కువ. వీరి అభిరుచి వీరు చేసే ప్రతి పనిలో స్పష్టమవుతుంది. ఎంత సాధించినా అంత ఈజీగా తృప్తి పడరు. సాంప్రదాయానికి విరుద్దంగా విభిన్న దారులలో సాగుతారు. గుంపులో గోవింద అనే మార్గానికి వీరు విరుద్దం. వీరికంటూ ప్రత్యేక శైలి ఉంటుంది. జీవితం మీద ఆశాభావంతో ఉంటారు.
ఎప్పుడూ పెద్ద లక్ష్యాలనే నిర్దేశించుకుంటారు. కొత్త సవాళ్లను స్వీకరిస్తారు. ఏదైనా సాధ్యమేననే భావన ఎల్లప్పుడూ మనసులో రగులుతూ ఉంటుంది. ఎవరి కోసం వ్యక్తిత్వాన్ని వదులుకోవడానికి ఇష్టపడరు. అవసరమైతే సంబంధాలు వదులుకోవడానికి అయినా సిద్దపడతారు. వీరని గౌరవించి, అర్థం చేసుకునేవారిని మాత్రమే వీరి సర్కిల్ లోకి అనుమతిస్తారు. ఒక ముక్కలో చెప్పాలంటే పైకి నిశ్శబ్దంగా కనిపిస్తూ అద్బుతాలు సృష్టించగలిదే వ్యక్తిత్వం వీరిది.
ఇది కూడా చదవండి: Anti-aging: 40ఏళ్ళు దాటినా యవ్వనంగా కనిపించాలనుందా? ఈ 4 టిప్స్ ట్రై చేసి చూడండి!
మరిన్ని ప్రత్యేక వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.
Updated Date - Jan 26 , 2024 | 02:17 PM