ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Copilot Key: మైక్రోసాఫ్ట్ సంచలన నిర్ణయం.. త్వరలో కీబోర్డుపై దర్శనమివ్వనున్న కొత్త కీ..

ABN, Publish Date - Jan 05 , 2024 | 06:21 PM

మైక్రోసాఫ్ట్ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై విడుదలయ్యే విండోస్ ఆధారిత లాప్‌టాప్, పీసీ కీబోర్డుల్లో ఏఐ కీ కూడా చేర్చనుంది. కుడివైపున ఉండే కంట్రోల్ కీ స్థానంలో ఏఐ కీని కీబోర్డులకు చేర్చనుంది. ఈ మేరకు తన అధికారిక బ్లాగ్‌పోస్ట్‌లో వెల్లడించింది.

ఇంటర్నెట్ డెస్క్: మైక్రోసాఫ్ట్ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై విడుదలయ్యే విండోస్ ఆధారిత లాప్‌టాప్, పీసీ కీబోర్డుల్లో కోపైలట్ కీని కూడా చేర్చనుంది. కుడివైపున ఉండే కంట్రోల్ కీ స్థానంలో ఈ ఏఐ చాట్‌బాట్ కీని జోడిస్తుంది. ఈ మేరకు తన అధికారిక బ్లాగ్‌పోస్ట్‌లో వెల్లడించింది. ఈ కీ నొక్కితే కోపైలట్ ఏఐ చాట్‌బాట్ లాంచ్ అవుతుందని మైక్రోసాఫ్ట్ చెప్పింది. దాదాపు 30 ఏళ్ల తరువాత విండోస్ కీబోర్డుల్లో మార్పుకు తెరతీసింది. చివరిసారిగా మైక్రోసాఫ్ట్..కీబోర్డులో విండోస్ బటన్ చేర్చింది.

ఏమిటీ కోపైలట్ ఏఐ

పీసీలో ఏఐ ఆధారిత ప్రపంచానికి ఈ బటన్ ముఖద్వారంలా పనిచేస్తుందని మైక్రోసాఫ్ట్ తన బ్లాగ్ పోస్ట్‌లో పేర్కొంది. కోపైలట్ కూడా చాట్‌జీపీటీ లాంటి ఏఐ చాట్‌బాట్. లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ ఆధారంగా దీన్ని రూపొందించారు. ఇప్పటికే విండోస్ 11 ఉన్న వారికి ఈ ఫీచర్ అందుబాటులో ఉంది. కీబోర్డుపై విండోస్ కీ+సీ కలిపి ప్రెస్ చేస్తే కోపైలట్ యాక్టివేట్ అవుతుంది.


కోపైలట్‌తో ఉపయోగాలు ఇవే..

యూజర్లు కోపైలట్‌తో తమకు నచ్చిన విధంగా చిత్రాలను క్రియేట్ చేసుకోవచ్చు. అంతేకాకుండా, ఈమెయిల్స్, ఇతర కంటెంట్‌లో ఉన్న తప్పులను కూడా సరిదిద్దుకోవచ్చు. ఇప్పటికే మైక్రోసాఫ్ట్ ఈ చాట్‌బాట్‌ను బింగ్, మైక్రోసాఫ్ట్ 365 ఉత్పత్తులు, విండోస్‌‌లో భాగం చేసింది. తాజాగా కీబోర్డుపై ఓ ప్రత్యేక కీని ఏర్పాటు చేస్తూ ఏఐ ప్రాముఖ్యత గురించి చెప్పకనే చెప్పింది.

ఇదిలా ఉంటే, ఏఐ ఆధారిత విండోస్ ఓఎస్‌ను కూడా మైక్రోసాప్ట్ సిద్ధం చేస్తున్నట్టు టెక్ వర్గాల్లో ఓ వార్త వైరల్ అవుతుంది. దీని పేరు విండోస్ రిఫ్రెష్ లేదా విండోస్ 12 అయి ఉండొచ్చని వార్తలు వెలువడ్డాయి. భవిష్యత్తులో విండోస్ వర్షెన్స్ రెడీ చేసేటప్పుడు తాము ఏఐపై కూడా దృష్టిపెడతామని మైక్రోసాఫ్ట్ కన్‌స్యూమర్ మార్కెటింగ్ విభాగాధిపతి యూసఫ్ మెహ్దీ గతంలో ఓసారి తెలిపారు.

మీరు అన్నం తినకూడదా? అయితే ఇలా చేయండి!

హైదరాబాద్‌కు వస్తే వీటిని ఒక్కసారైనా ట్రై చేయండి!

వావ్.. రోజూ గోరువెచ్చని నీరు తాగితే ఇన్ని లాభాలా!

Canada: భారతీయుల్లో కెనడాపై తగ్గుతున్న ఆసక్తి?

Updated Date - Jan 05 , 2024 | 06:38 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising