మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Miss Perfect Web Series: డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ‘మిస్ పర్ఫెక్ట్’

ABN, Publish Date - Feb 03 , 2024 | 10:58 AM

టాప్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ‘డిస్నీ ప్లస్ హాట్ స్టార్’పై (Disney Plus Hot Star) సరికొత్త వెబ్‌సిరీస్ ‘మిస్ పర్ఫెక్’ (Miss Perfect WebSeries) స్ట్రీమింగ్ అవుతోంది.

Miss Perfect Web Series: డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ‘మిస్ పర్ఫెక్ట్’

టాప్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ‘డిస్నీ ప్లస్ హాట్ స్టార్’పై (Disney Plus Hot Star) సరికొత్త వెబ్‌సిరీస్ ‘మిస్ పర్ఫెక్’ (Miss Perfect WebSeries) స్ట్రీమింగ్ అవుతోంది.

ఇది ఓ ప్రత్యేకమైన కథ. మన చుట్టూ కనిపించే మనుషులతో అల్లిన కథ. అపార్ట్‌మెంట్ వాతావరణంలో సరదా సరదాగా జరిగే హైడ్ అండ్ సీక్ గేమ్ లాంటి సిట్-కామ్ సిరీస్ ఇది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో స్ట్రీమ్ అవుతున్న ఈ సిరీస్ మంచి పాజిటివ్‌తో దూసుకెళ్తోంది. మన కథే తెరకెక్కిందా అనిపించేంత సహజంగా తెరకెక్కించారు. హాయిగా నవ్వుకునేలా ఉండడం, కొంచెం ఆలోచింపచేసేవిధంగా ఉండడంతో ‘మిస్ పర్ఫెక్ట్’ ప్రేక్షకులకు అంతగా నచ్చడానికి కారణమైంది. చుట్టుపక్కల ఫ్లాట్స్‌లో ఉండే రకరకాల మనుషులు, పని అమ్మాయి, చిన్న చిన్న విషయాలకు చిలవలు పలవలు కలిపి మాట్లాడుకునే మనుషులు, కాలక్షేపం చేసేవాళ్ళు.. ఇలా అన్నీ, అందరూ మన చుట్టూ తిరిగే పాత్రల్లానే ఉంటాయి. యువ దర్శకుడు విశ్వక్ ఖండేరావ్ ప్రేక్షకులకు పరిచయమైన జనాల మాదిరిగా రకరకాల పాత్రలతో ఈ సిరీస్‌ని లైవ్లీ‌గా ప్లాన్ చేసి తెరకెక్కించారు.

‘డిస్నీ ప్లస్ హాట్‌స్టార్’లో ‘మిస్ పర్ఫెక్ట్’ స్ట్రీమింగ్ కోసం క్లిక్ చేయండి

Untitled-3.jpg


రహస్యాలు, భిన్న జీవితాలు, రెండో అవకాశాల చుట్టూ తిరిగే కథ ఇది. ప్రతి ఒక్కరి జీవితంలో వ్యక్తిగత, వృత్తిపరమైన ఇబ్బందులకు సంబంధించిన సున్నితమైన అంశాలను చూపించడం ఈ సిరీస్ ప్రత్యేకతగా ఉంది. ఒకరి ప్రవర్తన చుట్టుపక్కల మనుషుల మీద ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందో ‘మిస్ పర్ఫెక్ట్’ చూపించింది.

ఇక అందాల రాక్షసి, సోగ్గాడే చిన్నినాయనా, భలే భలే మగాడివోయ్.. సినిమాలతో తెలుగువాళ్లకి బాగా దగ్గరైన లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో నటించి తనలోకి ఒక కొత్త నటిని పరిచయం చేసింది. వెబ్‌సిరీస్‌లో ఆమె పాత్ర పేరు కూడా ‘లావణ్య’ కావడం గమనార్హం. ఈ పాత్రలో లావణ్యకి క్లీనింగ్ అంటే చాలా ఇష్టం. ఏదైనా సరే పర్ఫెక్ట్‌గా ఉండాలనుకోవడం ఆమె బలం. దానికోసం రూల్స్ బ్రేక్ చేయడానికైనా ఆమె సిద్ధపడతారు. ఏదైనా వస్తువు ఉండాల్సిన చోట లేకపోతే ఆమె చాలా చిరాకు కలుగుతుంది. మిగతా పాత్రలు కూడా సినిమాలో చాలా ముఖ్యమైనవే. హర్ష వర్ధన్, ఝాన్సీ, మహేష్ విట్టా, అభిజీత్, అభిజ్ఞ, హర్ష్ రోషన్, సునయన, రూప లక్ష్మి, కేశవ్ దీపక్, మాణిక్ రెడ్డి మిగతా పాత్రల్లో మెప్పించారు. డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోన్న ‘మిస్ పర్ఫెక్ట్’ని తప్పక చూడండి.

‘డిస్నీ ప్లస్ హాట్‌స్టార్’లో ‘మిస్ పర్ఫెక్ట్’ స్ట్రీమింగ్ కోసం క్లిక్ చేయండి

Updated Date - Feb 03 , 2024 | 11:12 AM

Advertising
Advertising