మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Poonam Pandey Death: పూనమ్ పాండే ఆస్తి ఎంతో తెలిస్తే షాక్ అవుతారు..!

ABN, Publish Date - Feb 02 , 2024 | 04:09 PM

Poonam Pandey Networth: ప్రముఖ మోడల్, బోల్డ్ యాక్టర్ పూనమ్ పాండే సర్వికల్ క్యాన్సర్ కారణంగా శుక్రవారం నాడు కన్నమూసింది. ఆమె మరణ వార్తతో అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. 32 ఏళ్లకే పూనమ్ పాండే చనిపోవడం ఏంటా అని హతాశులయ్యారు.

Poonam Pandey Death: పూనమ్ పాండే ఆస్తి ఎంతో తెలిస్తే షాక్ అవుతారు..!
Poonam Pandey Properties

Poonam Pandey Networth: ప్రముఖ మోడల్, బోల్డ్ యాక్టర్ పూనమ్ పాండే సర్వికల్ క్యాన్సర్ కారణంగా శుక్రవారం నాడు కన్నమూసింది. ఆమె మరణ వార్తతో అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. 32 ఏళ్లకే పూనమ్ పాండే చనిపోవడం ఏంటా అని హతాశులయ్యారు. బోల్డ్ క్యారెక్టర్ కారణంగా తరచూ హెడ్‌లైన్స్‌లో నిలిచే పూనమ్ పాండే.. 2013లో ‘నషా’ సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. రియాల్టీ షోలు, మోడలింగ్ ద్వారా ఎంతో పేరు సంపాదించుకుంది. సోషల్ మీడియాలో వీడియోలు సహా పలు మార్గాల ద్వారా ఆమె భారీగానే సంపాదించినట్లు తెలుస్తోంది. చిన్న వయసులోనే పూనమ్ పాండే చనిపోవడంతో.. ఇప్పుడు జనాలు ఆమె సంపాదన, నికర ఆస్తుల విలువపై అనేక రకాల సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

రియాల్టీ షోలు, మోడలింగ్ చేసిన పూనమ్ పాండే.. సినిమాలు, టీవీల ద్వారా కూడా భారీగానే డబ్బు సంపాదించింది. మ్యాగజైన్‌ల కోసం బోల్డ్ ఫోటో షూట్‌ల ద్వారా పూనమ్ తన చిన్న కెరీర్‌లోనే చాలా డబ్బు సంపాదించింది. లగ్జరీ లైఫ్‌ను ఇష్టపడే పూనమ్ పాండే.. ముంబైలో తన కుటుంబానికి దూరంగా నివసించింది. అంతేకాదు.. తన పేరిట ప్రైవేట్ యాప్‌ని కూడా రన్ చేసింది. ఈ యాప్ ద్వారా బోల్డ్ కంటెట్ ‌పెడుతూ భారీగా సంపాదించింది పూన్ పాండే.

పూనమ్ పాండే నికర ఆస్తులు..

బాలీవుడ్ మీడియా కథనాల ప్రకారం.. పూనమ్ పాండే నిరక ఆస్తుల విలువ రూ. 51.46 కోట్లు. సినిమా కెరీర్‌లో నషా, లవ్‌ కి ప్యాషన్, మాలిని అండ్ కంపెనీ, ఆగయా హీరో, ది జర్నీ ఆఫ్ కర్మ వంటి సినిమాల్లో నటించింది పూనమ్ పాండే. పూనమ్.. టోటల్ నాదనియన్, ప్యార్ మొహబ్బత్ ష్ష్ అనే టెలివిజన్ షో కూడా నటించింది. 1991 మార్చి 11న ఢిల్లీలో జన్మించిన పూనమ్ పాండే.. కెరీర్‌లో స్టార్‌డమ్ కోసం బోల్డ్ యాక్టివిటీస్ చేసింది. ఇక, ఇక బిజినెస్ మెన్‌ను పెళ్లి చేసుకున్న పూనమ్ పాండే.. రోజుల వ్యవధిలోనే అతనితో విడాకులు తీసుకుంది. అప్పటి నుంచి మళ్లీ ఒంటిరిగా జీవిస్తూ వచ్చింది. మొత్తంగా పూనమ్ పాండే పేరిట ఉన్న రూ. 51.46 కోట్ల ఆస్తి ఎవరికి సొంతం అవుతుందనేది ఆసక్తిగా మారింది.

Updated Date - Feb 02 , 2024 | 04:09 PM

Advertising
Advertising