Success Life: కొత్త ఏడాదిలో విజయాలు సాధించాలనుకుంటున్నారా? అయితే ఈ పనులు తప్పక చెయ్యండి!
ABN, Publish Date - Jan 02 , 2024 | 05:28 PM
కొత్త అనే పదంలోనే బోలెడు ఆశావాదం ఉంటుంది. ప్రతి ఒక్కరూ కొత్త ఏడాదిలో అయినా జీవితంలో మార్పు రావాలని, జీవన నాణ్యత మెరుగుపడాలని, సక్సెస్ కావాలని అనుకుంటారు. అందుకోసం ఈ పనులు చేస్తే చాలు.
కొత్త అనే పదంలోనే బోలెడు ఆశావాదం ఉంటుంది. ప్రతి ఒక్కరూ కొత్త ఏడాదిలో అయినా జీవితంలో మార్పు రావాలని, జీవన నాణ్యత మెరుగుపడాలని, వృత్తి, ఆరోగ్యం, జీవన ప్రమాణాలు మెరుగుపడాలని అనుకుంటారు. దానికి తగ్గట్టే కొత్త ఏడాది మొదలు నుండే కొత్త నిర్ణయాలు, కొత్త అలవాట్లు పాటించాలని నిర్ణయాలు తీసుకుంటారు. అయితే కొత్త ఏడాదిలో విజయాలు సాధించాలన్నా, లక్ష్యాలు నెరవేరాలన్నా ఈ కింద చెప్పుకునే పనులు పాటించాలి. తప్పకుండా విజయం మీ సొంతమవుతుంది.
నిద్రవేళ పాటించాలి..
ఉదయాన్నే లేవడం అలవాటు చేసుకోవాలి. నిద్రలేచిన తర్వాత ఆ రోజు ఏం చేయాలో ప్లాన్ చేసుకోవచ్చు. దానిని పాటించడం వల్ల అనుకున్న పనులలో చాలా వరకు పూర్తీ చేయవచ్చు. దీనివల్ల రోజంతా క్రమపద్ధతిలో పని చేయవచ్చు.
ప్రతికూల ఆలోచనలకు దూరం..
మీతో చెడుగా మాట్లాడే, మీ గురించి చెడుగా చెప్పే వ్యక్తిని లేదా వస్తువును దూరంగా ఉంచాలి. మీ సర్కిల్ లోకి వారిని రానివ్వకుండా ఎంత దూరం ఉంచితే అంత మంచిది. ఇది సానుకూలంగా ఆలోచించే శక్తిని చేకూరుస్తుంది.
ఇది కూడా చదవండి: జీవితంలో సక్సెస్ కావాలంటే చెయ్యాల్సిన 10 పనులివీ..!
ఆరోగ్యం, ఆహారం..
ఆరోగ్యం బాగుంటేనే ఏ పని అయినా చేయగలం. శారీరకంగానూ, మానసికంగానూ ఆరోగ్యంగా ఉండాలి. మానసిక, శారీరక ఆరోగ్యాలను ప్రోత్సహించే ఆహారాలు తీసుకోవాలి. పోషకాలు, ఫైబర్, ప్రోటీన్, విటమిన్లు అన్ని భర్తీ చేసే ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వాలి.
వ్యాయామం..
వ్యాయామం కేవలం శరీర ఆరోగ్యాన్నే కాదు, మానసిక ఆరోగ్యాన్ని కూడా మెరుగ్గా ఉంచుతుంది. వారంలో తప్పనిసరిగా 6రోజులు వ్యాయామం చెయ్యాలి. వీలుంటే 7రోజులూ చేయవచ్చు. ఇది ఏ పనిని అయినా సాధించేందుకు శరీరం దృఢంగా ఉంచేలా చేస్తుంది.
పుస్తక పఠనం..
గొప్ప వ్యక్తుల జీవితాలను పరిశీలిస్తే పుస్తక పఠనం వారికి గొప్ప అలవాటుగా ఉంటుంది. రోజులో కనీసం 20నిమిషాలు ఏదైనా మంచి పుస్తకాన్ని చదివితే బోలెడంత భాషా జ్ఞానం, ప్రపంచ జ్ఞానం లభిస్తాయి. వ్యక్తిత్వం మెరుగవుతుంది.
ఇది కూడా చదవండి: ఓ మై గాడ్.. లవంగాల పొడిని పాలలో కలిపి తాగితే.. జరిగేదిదే..!
అదనపు కార్యాచారణ..
ఉదయం నుండి రాత్రి వరకూ రోజూ ఎన్నో పనులు చేస్తుంటాం. అయితే ఈ పనులను ఓ అరగంట సేపు పక్కనుంచి ఏదైనా ప్రత్యేక విషయాన్ని, కొత్త పనిని నేర్చుకోవాలి. ఏమో ఎవరు చెప్పొచ్చారు. ఒక హాబీగా మొదలైన ఆ పనే రేపటి రోజున వృత్తిగా మారే అవకాశం ఉండచ్చేమో.
మౌనం..
మౌనం గొప్ప ఆయుధం అని అంటారు. కానీ నేటి వేగవంతమైన జీవితాల్లో రోజూ 15నిమిషాలు మౌనంగా ఉండటం చాలా అవసరం. ఏకాంతంగా గడిపే ఈ 15నిమిషాల కాలంలో ఆత్మవిమర్శ చేసుకోవచ్చు. వేధించే ఎన్నో ప్రశ్నలకు ఈ మౌనంలో సమాధానాలు దొరకచ్చు. ధ్యానం కూడా చేయవచ్చు.
పరిశీలన..
రోజంతా చేసిన పనులను రాత్రిసమయంలో పరిశీలించుకోవాలి. డైరీలా కూడా రాసుకోవచ్చు. జీవితం మెరుగ్గా ఉందా లేదా చూసుకోవడానికి ,లక్ష్యం కోసం మరింత మెరుగవ్వడానికి ఇది సహాయపడుతుంది.
ఇది కూడా చదవండి: Eggs: గుడ్లు బాగా తింటుంటారా? చాలా మందికి తెలియని నిజాలు ఇవీ..!!
సబ్ కాన్షియస్ మైండ్..
మనిషి సబ్ కాన్షియస్ మైండ్ చాలా శక్తివంతమైననది. ఇది సాధారణ మెదడుకంటే వంద రెట్లు శక్తివంతంగా ఉంటుంది. ఏదైనా ఒక విషయాన్ని మనసులో పదే పదే మననం చేసుకుంటే దాని వైపు వ్యక్తి ఆకర్షించబడి విజయం సాధించగలడు. రాత్రి సమయంలో పడుకునేముందు ఓ 5నిమిషాలు లక్ష్యాలు సాధించినట్టు అనుభూతి చెందుతూ ఉంటే తొందరలోనే విజయం మీ సొంతమవుతుంది.
కృతజ్ఞత..
ఈ ప్రపంచంలో కృతజ్ఞత చాలా గొప్పది. కృతజ్ఞత చెప్పడం అంటే వ్యక్తి సంపూర్ణతను సాధించడం. రోజులో విజయాలున్నా, అపజయాలున్నా, బాద, సంతోషం ఇలా ఏమున్నా రోజు చివరిలో ఆ రోజు గడిచినందుకు కృతజ్ఞత చెప్పుకోవాలి.
ఇది కూడా చదవండి: Fatty Liver: చలికాలంలో చేసే ఈ పొరపాట్ల వల్ల కాలేయానికి ఎంత నష్టమో తెలుసా..?
మరిన్ని వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.
Updated Date - Jan 02 , 2024 | 05:28 PM