ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Horoscope: రాశిఫలాలు

ABN, Publish Date - Jan 28 , 2024 | 07:45 AM

నేడు (28-1-2024 - ఆదివారం) వృషభ రాశి వారు సన్నిహితులతో దూరప్రయాణాలకు ఏర్పాట్లు చేసుకుంటారు. మిథునరాశి వారికి పెట్టుబడులు లాభిస్తాయి. కర్కాటక రాశి వారికి నూతన భాగస్వామ్యాల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి.....

నేడు (28-1-2024 - ఆదివారం) వృషభ రాశి వారు సన్నిహితులతో దూరప్రయాణాలకు ఏర్పాట్లు చేసుకుంటారు. మిథునరాశి వారికి పెట్టుబడులు లాభిస్తాయి. కర్కాటక రాశి వారికి నూతన భాగస్వామ్యాల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి.

మేషం (మార్చి 21 - ఏప్రిల్‌ 20 మధ్య జన్మించిన వారు)

పరిశ్రమలు, వ్యవసాయ రంగాల వారు కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆరోగ్యం, యోగ, ఆహార నియమాల విషయంలో శ్రద్ధ చూపుతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. విందు వినోదాలు ఉల్లాసం కలిగిస్తాయి. ఆలయదర్శనం శుభప్రదం.

వృషభం (ఏప్రిల్‌ 21 - మే 20 మధ్య జన్మించిన వారు)

చిన్నారులతో ప్రయాణాలు ఉల్లాసం కలిగిస్తాయి. గత అనుభవంతో ఆర్థికంగా లబ్ధి పొందుతారు. ఉన్నత విద్య, విదేశీ వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. ప్రియతములకు సంబంధించి ముఖ్యమైన సమాచారం తెలుసుకుంటారు. దుర్గామాత ఆరాధన శుభప్రదం.

మిథునం (మే 21-జూన్‌ 21 మధ్య జన్మించిన వారు)

కుటుంబ సభ్యుల కోసం విలువైన వస్తువుల కొనుగోలు చేస్తారు. సంకల్పం నెరవేరుతుంది. బంధుమిత్రుల రాకతో ఇల్లు సందడిగా వుంటుంది. రియల్‌ ఎస్టేట్‌, నిర్మాణ రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా వుంటుంది. గోసేవ శుభప్రదం.

కర్కాటకం (జూన్‌ 22 - జూలై 23 మధ్య జన్మించిన వారు)

విద్యార్థులకు లక్ష్య సాధనలో పెద్దల సహకారం లభిస్తుంది. ప్రముఖులతో చర్చలు, సమావేశాలకు అనుకూలం. వాహన యోగం వుంది. సోదరీ, సోదరుల విషయాల్లో శుభపరిణామాలు సంభవం. ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. సేవా కార్యక్రమాలు సాంత్వన కలిగిస్తాయి.

సింహం (జూలై 24 - ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు)

సమావేశాలు, బృందకార్యక్రమాల్లో కొత్త పరిచయాలు ఏర్పడతాయి. బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు. వేడుకలకు అవసరమైన నిధులు సమకూరతాయి. పెట్టుబడులు, పొదుపు పథకాలకు సంబంధించిన వ్యూహాలు ఫలిస్తాయి. సూర్యారాధన శుభప్రదం.

కన్య (ఆగస్టు 24 - సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు)

ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు అందుకుంటారు. హోటల్‌, వైద్యం, రిటైల్‌ వ్యాపారాల వారికి ఆర్థికంగా అనుకూలిస్తుంది. అదనపు ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యవసాయం, పరిశ్రమల రంగాల వారు అనుకున్న పనులు పూర్తిచేయగలుగుతారు. గోసేవ శుభప్రదం.

తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు)

ప్రియతములకు సంబంధించి రహస్య సమాచారం తెలుసుకుంటారు. ఉన్నత విద్య, విదేశీ ప్రయాణాలకు అనకూలంగా ఉంటుంది. రాజకీయ, సినీ రంగాల వారికి జనసంబంధాలు విస్తరిస్తాయి. టెలివిజన్‌, రచనా రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది.

వృశ్చికం (అక్టోబరు 24 - నవంబరు 22 మధ్య జన్మించిన వారు)

రియల్‌, ఎస్టేట్‌, నిర్మాణ రంగాల వారు మంచి ప్రతిఫలాలు అందుకుంటారు. బంధుమిత్రులతో వేడుకలు, విందుల్లో పాల్గొంటారు. బ్యాంకులు, ఆర్థిక సంస్థల రంగాల వారికి వృత్తి, వ్యాపారాల్లో ప్రోత్సాహకరంగా వుంటుంది. యూనియన్‌ కార్యకలాపాల్లో విజయం సాధిస్తారు.

ధనుస్సు (నవంబరు 23 - డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు)

ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. ఉద్యోగ, వ్యాపారాలకు సంబంధించి కీలక సమాచారం అందుకుంటారు. చిన్నారుల విషయంలో పెద్దలుగా మీ బాధ్యతలు నిర్వర్తిస్తారు. పొదుపు పథకాలు, విద్యా విషయాల్లో పెద్దల సహకారం లభిస్తుంది.

మకరం (డిసెంబరు 22-జనవరి 20 మధ్య జన్మించిన వారు)

కొత్త వ్యూహాలు అమలు చేసి విజయం సాధిస్తారు. ఆర్థిక విషయాలకు సంబంధించిన ప్రయాణాలు, సమావేశాలు ఫలిస్తాయి. రక్షణ, బోధన, న్యాయ, కన్సల్టెన్సీ విద్యా రంగాల వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. అంచనాలు ఫలిస్తాయి.

కుంభం (జనవరి 21 - ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు)

ఆర్థిక వ్యవహారాల్లో సన్నిహితుల సహకారం లభిస్తుంది. బిల్లులు, ఫీజులు చెల్లిస్తారు. రుణప్రయత్నాలు ఫలిస్తాయి. రుణాలు, పెట్టుబడులు, షేర్‌మార్కెట్‌ లావాదేవీలకు సంబంధించి కీలక పత్రాలు అందుకుంటారు. ఆదిత్య హృదయ పారాయణ శుభప్రదం.

మీనం (ఫిబ్రవరి 20 - మార్చి 20 మధ్య జన్మించిన వారు)

స్పెక్యులేషన్లు, పందాలు, పోటీల్లో విజయం సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా వుంటుంది. ప్రియతముల కోసం విలువైన వస్తువులు సమకూర్చుకుంటారు. బృందకార్యక్రమాలు, వేడుకల కోసం ఖర్చు చేస్తారు. దుర్గామాతను ఆరాధించండి.

- బిజుమళ్ళ బిందుమాధవ శర్మ

Updated Date - Jan 28 , 2024 | 07:46 AM

Advertising
Advertising