ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Plants : నీరు అవసరం లేని మొక్కల గురించి తెలుసా.. వీటిని పెంచడం ఎంత తేలికంటే..!

ABN, Publish Date - Feb 02 , 2024 | 04:42 PM

కాగితం పూలతో తయారు చేసినట్టుగా ఉంటే వీటి పూలు సువాసనలు ఇవ్వకపోయినా నిండుగా అలంకరించినట్టుగా ఎక్కడ పెంచినా పెరుగుతాయి.

watering

నీరు లేకుండా మొక్కలు పెరుగుతాయా.. అస్సలు నీరు లేకుండా మొక్కలు పెరుగడం అంటే అసాధ్యమే.. కాకపోతే రోజూ నీరు పోసే అవసరం, సంరక్షించే అవసరం ఉండని మొక్కలు కొన్ని ఉన్నాయి. వాటికి కొద్దిగా నీరు అందిస్తే చాలు.. చక్కగా పెరుగుతాయి. అలాంటి మొక్కల్లో కొన్ని రకాల గురించి తెలుసుకుందాం.

బౌగెన్విల్లా..

అవి ఇంటి తోటకి అందాన్ని తెస్తాయి. రంగురంగుల పూలతో ఇంటికే అందాన్ని తెస్తాయి. కాగితం పూలతో తయారు చేసినట్టుగా ఉంటే వీటి పూలు సువాసనలు ఇవ్వకపోయినా నిండుగా అలంకరించినట్టుగా ఎక్కడ పెంచినా పెరుగుతాయి. మరీ నీరు అవసరంలేని బౌగెన్విల్లా మొక్కలను పెంచడం చాలా తేలిక కూడా..

కలబంద..

ఇంటి ముందు ఈ మొక్క ఉంటే దుష్టభయాలుండవనేది పెద్దలు చెప్పే మాట. అలాగే ఈ మొక్కను అందాన్ని పెంచేందుకు కూడా వాడతారు. జుట్టు వెంట్రుకలకు కూడా ఒత్తును ఇస్తుంది. ఈ మొక్కను పెంచాలన్నా కూడా నీరు అవసరం లేదు. గుత్తులు గుత్తులు గా ఆకులే అందంగా ఉంటాయి.

రబ్బరు చెట్టు..

వేసవిలో నెలకు ఒకసారి మాత్రమే ఈ రబ్బరు చెట్టుకు నీరు పెట్టాలి. మిగతా ఏడాదంతా చెట్టుకు నెలల తరబడి నీరు అవసరం లేదు.

ఇది కూడా చదవండి: హై ప్రోటీన్స్ ఉన్న ఇండియన్ బ్రేక్ ఫాస్ట్స్ గురించి తెలుసా..!

మనీ ఫ్లాంట్

మనీ ఫ్లాంట్ పెంచడం ఇంటికి అందమే కాదు. డబ్బును కూడా తెస్తుందని చాలా పెద్ద నమ్మకమే ఉంది. ఎందురో దీనిని ఇంటి బయట లోపలా కూడా పెంచుతారు. అయితే ఇది నీరు లేకుండా కూడా పెరుగుతుంది.

జాడే మొక్క..

ఉష్ణ మండల ప్రాంతాల్లో కాక్టస్ వంటి లక్షణాలున్న జాడే మొక్కలు వారానికి ఒకసారి లేదా రెండు సార్లు పెట్టినా సరిపోతుంది. పెద్దగా నీరు అవసరం లేని మొక్కలలో ఇవి కూడా ఒకటి.

స్నేక్ ఫ్లాంట్..

పాము మెలికల్లా ఉండే ఈ మొక్క నీరు పెట్టక పోయినా పెరుగుతుంది. దీనిని పెంచాలంటే వెలుతురు, గాలి మాత్రమే అవసరం. వారానికి ఓ మారు నీరు పెడితే చాలు.


తులసి

మామూలుగానే అవసరం లేకపోయినా ఈ మొక్కకు నీరు పూజల పేరుతో పోస్తూనే ఉంటారు కానీ దీనికి నీరు తేమగా లేనప్పుడు మాత్రమే అవసరం అవుతుంది.

కాక్టస్ మొక్క..

నీటిని నిల్వ చేయడానికి కాక్టస్ సరిపోతుంది. దీనిని నెలల తరబడి నీరు లేకపోయినా బ్రతికే గుణం ఉంది.

కిత్తలి..

కిత్తలి పెద్దగా సంరక్షణ అవసరం లేని మొక్క. నెలలో రెండు మూడుసార్లు నీళ్ళు పెడితే సరిపోతుంది.

Updated Date - Feb 02 , 2024 | 04:44 PM

Advertising
Advertising