India vs England: భారత బౌలర్ల ధాటికి ఇంగ్లండ్ ఆలౌట్.. టీమిండియాదే పైచేయి
ABN, Publish Date - Feb 03 , 2024 | 04:51 PM
వైజాగ్ వేదికగా భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ రెండో రోజు ఆటలో భాగంగా ఇంగ్లండ్ జట్టు ఆలౌట్ అయ్యింది. భారత బౌలర్ల ధాటికి కేవలం 253 పరుగులకే ప్రత్యర్థి టీమ్ చాపచుట్టేసింది. దీంతో.. తొలి ఇన్నింగ్స్‌లో భారత జట్టు 143 పరుగుల ఆధిక్యం సాధించింది. ముఖ్యంగా.. భారత పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా ఇంగ్లండ్ బ్యాటింగ్ పతనాన్ని శాసించాడు.
వైజాగ్ వేదికగా భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ రెండో రోజు ఆటలో భాగంగా ఇంగ్లండ్ జట్టు ఆలౌట్ అయ్యింది. భారత బౌలర్ల ధాటికి కేవలం 253 పరుగులకే ప్రత్యర్థి టీమ్ చాపచుట్టేసింది. దీంతో.. తొలి ఇన్నింగ్స్‌లో భారత జట్టు 143 పరుగుల ఆధిక్యం సాధించింది. ముఖ్యంగా.. భారత పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా ఇంగ్లండ్ బ్యాటింగ్ పతనాన్ని శాసించాడు. అతడు ఏకంగా ఆరు వికెట్లు పడగొట్టాడు. అతని దెబ్బకే ఇంగ్లండ్ జట్టు పేకమేడలా కుప్పకూలింది. ఇక ఇంగ్లండ్ బ్యాటర్లలో జాక్ క్రాలీ (76), బెన్ స్టోక్స్ (47) మాత్రమే బాగా రాణించగలిగారు. మిగతావాళ్లు మాత్రం విఫలమయ్యారు. ఇక మిగిలిన బౌలర్లలో కుల్దీప్ యాదవ్ మూడు, అక్షర్ పటేల్ ఒక వికెట్ పడగొట్టారు.
అంతకుముందు.. బ్యాటింగ్ చేసిన టీమిండియా 392 పరుగులకి ఆలౌట్ అయ్యింది. యువ ఆటగాడు యశస్వీ జైస్వాల్ (209) ద్విశతకంతో చెలరేగిపోవడం వల్ల భారత్ అంత స్కోరు చేయగలిగింది. మిగతా బ్యాటర్లలో ఏ ఒక్కరూ పెద్దగా రాణించలేదు. శుభ్‌మన్ గిల్ (34) పరుగులతో కాస్త పర్వాలేదనిపించాడంతే. ఇప్పుడు తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 143 పరుగుల ఆధిక్యం సాధించింది కాబట్టి.. ఇంగ్లండ్‌కు భారీ టార్గెట్ పెట్టే ఆస్కారం ఉంది. రెండో ఇన్నింగ్స్‌లో భారత జట్టు సమిష్టిగా రాణిస్తే.. ఈ రెండో టెస్ట్ మ్యాచ్‌ని భారత్ కైవసం చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. అదే జరిగితే.. తొలి టెస్ట్ పరాజయానికి గాను భారత్ ప్రతీకారం తీర్చుకున్నట్టే. మరి.. రెండో ఇన్నింగ్స్‌లో భారత్ ఎలా రాణిస్తుందో చూడాలి.
Updated Date - Feb 03 , 2024 | 04:51 PM