India vs England: రెండో ఇన్నింగ్స్‌లో భారత్ ఆలౌట్.. ఇంగ్లండ్ లక్ష్యం ఎంతంటే?
ABN, Publish Date - Feb 04 , 2024 | 03:49 PM
తొలి ఇన్నింగ్స్‌లో 143 పరుగుల ఆధిక్యంతో బరిలోకి దిగిన భారత జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 255 పరుగులకి ఆలౌట్ అయ్యింది. యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్ (104) శతక్కొట్టడంతో పాటు అక్షర్ పటేల్ (45) మెరుగ్గా రాణించడం వల్లే.. టీమిండియా అంత స్కోరు చేయగలిగింది. మిగతా బ్యాటర్లు మాత్రం పెద్దగా సత్తా చాటలేకపోయారు.
తొలి ఇన్నింగ్స్‌లో 143 పరుగుల ఆధిక్యంతో బరిలోకి దిగిన భారత జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 255 పరుగులకి ఆలౌట్ అయ్యింది. యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్ (104) శతక్కొట్టడంతో పాటు అక్షర్ పటేల్ (45) మెరుగ్గా రాణించడం వల్లే.. టీమిండియా అంత స్కోరు చేయగలిగింది. మిగతా బ్యాటర్లు మాత్రం పెద్దగా సత్తా చాటలేకపోయారు. దీంతో.. ఇంగ్లండ్ ముందు భారత్ 399 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించినట్టు అయ్యింది. ఇది చెప్పుకోవడానికి పెద్ద లక్ష్యమే అయినా.. తొలి టెస్టులో జరిగిన పరిణామాల దృష్ట్యా ఈ మ్యాచ్ గెలుపొందాలంటే భారత బౌలర్లు విజృంభించాల్సి ఉంటుంది. ఇంగ్లండ్ బ్యాటర్లను క్రీజులో నిలదొక్కుకునే అవకాశం ఇవ్వకుండా వికెట్లు తీస్తూ ఉండాలి. మరి, ఈసారి భారత జట్టు ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో చూడాలి.
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 396 పరుగులకి ఆలౌట్ అయ్యింది. యశస్వీ జైస్వాల్ (209) ద్విశతకంతో చెలరేగి, భారత జట్టుకి భారీ స్కోరుని అందించగలిగాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ జట్టు.. భారత బౌలర్ల ధాటికి 253 పరుగులకే కుప్పకూలింది. ముఖ్యంగా.. జస్‌ప్రీత్ బుమ్రా తాండవం చేసి, ఇంగ్లండ్ బ్యాటింగ్ పతనాన్ని శాసించాడు. అతడు ఏకంగా ఆరు వికెట్లు పడగొట్టాడు. తన బౌలింగ్‌తో ఇంగ్లండ్ బ్యాటర్లకు ముచ్చెమటలు పట్టించాడు. ఇక కుల్దీప్ యాదవ్ మూడు వికెట్లు తీయగా, అక్షర్ పటేల్ ఒక వికెట్ పడగొట్టాడు. మన భారత బౌలర్లు ఇదే జోరు రెండో ఇన్నింగ్స్‌లోనూ ప్రదర్శిస్తే.. ఈ మ్యాచ్ టీమిండియాదే!
Updated Date - Feb 04 , 2024 | 03:49 PM