ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

India vs South Africa: సౌతాఫ్రికాపై భారత్ ఘనవిజయం.. టెస్టు సిరీస్ సమం

ABN, Publish Date - Jan 04 , 2024 | 05:31 PM

న్యూలాండ్స్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో టీమిండియా ఘనవిజయం సాధించింది. 7 వికెట్ల తేడాతో భారత్ విజయకేతనం ఎగురవేసింది. దీంతో.. రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ 1-1తో సమం అయ్యింది.

న్యూలాండ్స్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో టీమిండియా ఘనవిజయం సాధించింది. 7 వికెట్ల తేడాతో భారత్ విజయకేతనం ఎగురవేసింది. దీంతో.. రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ 1-1తో సమం అయ్యింది. కేవలం ఒకటిన్నర రోజుల్లోనే ఈ టెస్టు మ్యాచ్ ముగిసిపోవడం గమనార్హం. తొలుత ఫస్ట్ ఇన్నింగ్స్ ఆడిన సౌతాఫ్రికా జట్టు 55 పరుగులకే ఆలౌట్ అవ్వగా.. భారత్ 153 పరుగులు చేసింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో ప్రత్యర్థి జట్టు 176 పరుగులు చేయగలిగింది. దీంతో.. ఆ జట్టు 78 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. ఐడెన్ మార్క్‌రమ్ (106) చేసిన సెంచరీ పుణ్యమా అని.. సౌతాఫ్రికా అంత స్కోరు చేయగలిగింది. అతడు తప్ప మిగిలిన బ్యాటెర్లవ్వరూ కొద్దిసేపు కూడా క్రీజులో నిలబడలేకపోయారు.

ఇక 79 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు.. 12 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 80 పరుగులు చేసి గెలుపొందింది. తొలి ఇన్నింగ్స్‌లో డకౌట్ అయిన ఓపెనర్ యశస్వీ జైస్వాల్ రెండో ఇన్నింగ్స్‌లో కాసేపు మెరుపులు మెరిపించాడు. 23 బంతుల్లోనే 6 ఫోర్ల సహకారంతో 28 పరుగులు చేశాడు. ఇక కెప్టెన్ రోహిత్ శర్మ 17, శుభ్‌మన్ గిల్ 10, విరాట్ కోహ్లీ 12, శ్రేయస్ అయ్యర్ 4 పరుగులు చేశారు. సౌతాఫ్రికా బౌలర్లలో రబాడా, బర్గర్, యాన్సెస్ తలా వికెట్ పడగొట్టారు. అయితే.. భారత్ గెలుపులో ఈసారి బౌలర్లు కీలక పాత్ర పోషించారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా.. సిరాజ్, బుమ్రా ఊచకోత కోశారు. మొదటి ఇన్నింగ్స్‌లో సిరాజ్ ఆరు వికెట్లతో తాండవం చేయగా, రెండో ఇన్నింగ్స్‌లో బుమ్రా ఆరు వికెట్లు పడగొట్టి సౌతాఫ్రికా బ్యాటింగ్ పతనాన్ని శాసించాడు.


తొలి ఇన్నింగ్స్

తొలుత టాస్ గెలిచిన సౌతాఫ్రికా జట్టు బ్యాటింగ్ ఎంపిక చేసుకొని రంగంలోకి దిగింది. తొలి టెస్టు మ్యాచ్ గెలుపు ఉత్సాహంలో ఉన్న ప్రత్యర్థి జట్టు.. రెండో టెస్టులోనూ అదే దూకుడు కొనసాగించాలని భావించింది. అయితే.. వారి ఆశలపై మహమ్మద్ సిరాజ్ (6/15) నీళ్లు చల్లేశాడు. నిప్పులు చెరిగే బంతులు సంధించి.. సౌతాఫ్రికా బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. అతని ధాటికి.. తొలి సెషన్‌లోనే ప్రత్యర్థి జట్టు 23.2 ఓవర్లలో 55 పరుగులకే కుప్పకూలింది. టెస్టుల్లో సౌతాఫ్రికాకు ఇదే అత్యల్ప స్కోరు. సిరాజ్ ఆరు వికెట్లతో తాండవం చేయగా.. ముకేశ్, బుమ్రా రెండేసి వికెట్లు పడగొట్టారు.

అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు.. మొదట్లో మెరుగ్గా రాణించింది. యశస్వీ జైస్వాల్ డకౌట్ అయినప్పటికీ.. రోహిత్ శర్మ (39), శుభ్‌మన్ గిల్ (36), విరాట్ కోహ్లీ (46) మంచి ప్రదర్శన కనబరిచారు. ఇది చూసి.. భారత్ మెరుగైన స్కోరే చేస్తుందని అంతా భావించారు. కానీ.. ఆ తర్వాత భారత్ పేకమేడలా కూలింది. 153 వద్ద నుంచి భారత జట్టు వరుసగా ఆరు వికెట్లు కోల్పోయింది. యశస్వీతో కలుపుకుంటే మొత్తం ఆరుగురు బ్యాటర్లు సున్నా పరుగులకే తట్టాబుట్టా సర్దేశారు. దీంతో.. సౌతాఫ్రికాపై భారత్ 98 పరుగుల ఆధిక్యాన్ని మాత్రమే సాధించగలిగింది.

Updated Date - Jan 04 , 2024 | 05:42 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising