ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Sania Mirza: సానియా మీర్జా గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా? ఆమె సంపాదన ఎంతంటే..

ABN, Publish Date - Jan 23 , 2024 | 08:35 PM

భారత్‌లో టెన్నిస్‌కు గ్రామర్‌ను, గ్లామర్‌ను అందించి స్టార్‌గా ఎదిగింది సానియా మీర్జా. ఓ మామూలు క్రీడాకారిణిగా ప్రారంభమైన సానియా ప్రస్థానం అంతర్జాతీయ స్థాయికి చేరింది. ఎన్నో టైటిళ్లను తన ఖాతాలో వేసుకుంది. ఎంతో సంపాదించింది.

భారత్‌లో టెన్నిస్‌కు గ్రామర్‌ను, గ్లామర్‌ను అందించి స్టార్‌గా ఎదిగింది సానియా మీర్జా (Sania Mirza). ఓ మామూలు క్రీడాకారిణిగా ప్రారంభమైన సానియా ప్రస్థానం అంతర్జాతీయ స్థాయికి చేరింది. ఎన్నో టైటిళ్లను తన ఖాతాలో వేసుకుంది. ఎంతో సంపాదించింది. పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌ (Shoaib Malik)ను ప్రేమించి పెళ్లి చేసుకుని చాలా మందికి షాకిచ్చింది. తాజాగా అతడికి విడాకులు (Sania Mirza Divorce) ఇచ్చేసి మరింత పెద్ద షాకిచ్చింది. ఈ నేపథ్యంలో సానియా వ్యక్తిగత జీవితం గురించి కొన్నిఆసక్తికర విశేషాలు వైరల్ అవుతున్నాయి.

2023 ఆస్ట్రేలియన్ ఓపెన్‌ తర్వాత సానియా మీర్జా ఆటకు రిటైర్మెంట్‌ ప్రకటించింది. అప్పటికి సానియా వ్యక్తిగత సంపద 26 మిలియన్ డాలర్లు. అంటే భారతీయ కరెన్సీలో దాదాపు రూ.201 కోట్లకు సమానం. తన గ్రాండ్ స్లామ్ కెరీర్‌లో సానియా మొత్తం ఆరు డబుల్స్ టైటిళ్లను కైవసం చేసుకుంది. ఓవరాల్‌గా సానియా మొత్తం 43 డబుల్స్ టైటిల్స్ సాధించింది. అంతేకాదు మహిళల డబుల్స్ విభాగంలో ఆమె ప్రపంచ నెంబర్ వన్ ర్యాంకును కైవసం చేసుకుంది. 2016లో టైమ్ మ్యాగజైన్ ప్రకటించిన ప్రపంచంలో అత్యంత ప్రభావవంతమైన 100 మంది వ్యక్తుల జాబితాలో సానియా స్థానం సంపాదించింది (Sania Mirza Net worth).

``ది బ్రిడ్జ్`` నివేదిక ప్రకారం సానియా కెరీర్ ఆదాయం రూ.52 కోట్లు. ఇక, బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌ల ద్వారా ఆమె గణనీయమైన ఆదాయాన్ని సంపాదించుకుంది. 2015లో ప్రపంచ నంబర్ వన్‌గా ఉన్న సమయంలో సానియా ప్రతి ఎండార్స్‌మెంట్‌కు రూ. 60 నుంచి రూ. 75 లక్షల వరకు తీసుకునేది. 2022 నాటికి టెన్నిస్, ఎండార్స్‌మెంట్‌ల ద్వారా సానియా వార్షిక సంపాదన రూ. 25 కోట్లు. సానియా ఇప్పటికి కూడా జిందా తిలిస్మాత్, లాక్మే ఇండియా, లివోజెన్ వంటి బ్రాండ్‌లను ప్రమోట్ చేస్తోంది. కాగా, షోయబ్ మాలిక్ నుంచి సానియా విడాకులు తీసుకుంది. సానియా నుంచి విడిపోయిన మాలిక్ పాక్ నటి సనా జావేద్‌ను వివాహం చేసుకున్నాడు.

Updated Date - Jan 23 , 2024 | 08:35 PM

Advertising
Advertising