Eng vs Ind Test Match: మాకు ధైర్యం సరిపోలేదు.. ఓటమిపై టీమిండియా కెప్టెన్ రోహిత్ వ్యాఖ్యలు!
ABN, Publish Date - Jan 28 , 2024 | 08:51 PM
హైదరాబాద్ టెస్ట్‌లో ఊహించని విధంగా టీమిండియా పరాజయాన్ని మూటగట్టుకుంది. ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో 28 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. 230 పరుగుల లక్ష్య ఛేదనలో టీమిండియా 202 పరుగులకు ఆలౌటైంది.
హైదరాబాద్ టెస్ట్‌లో ఊహించని విధంగా టీమిండియా పరాజయాన్ని మూటగట్టుకుంది (Eng vs Ind Test Match). ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో 28 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. 230 పరుగుల లక్ష్య ఛేదనలో టీమిండియా 202 పరుగులకు ఆలౌటైంది. ఈ టెస్ట్ మ్యాచ్‌లో తొలి రెండ్రోజులు ఆధిపత్యం వహించిన రోహిత్ సేన ఆ తర్వాత తడబడి ఇంగ్లండ్‌కు మ్యాచ్ సమర్పించుకుంది. ఈ విజయంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇంగ్లండ్ 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. మ్యాచ్ అనంతరం తమ ఓటమికి గల కారణాలపై రోహిత్ (Rohit Sharma) స్పందించాడు.
``రెండో ఇన్నింగ్స్‌లో ఛేజింగ్ చేసేటపుడు మా జట్టుకు ధైర్యం సరిపోలేదు. మేం అవకాశాలు తీసుకోలేకపోయాం. ఓ జట్టుగా పూర్తిగా విఫలమయ్యాం. ఓలీ పోప్ అద్భుత ఇన్నింగ్స్‌తో ఈ మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. భారత్‌లో నేను చూసిన అత్యుత్తమ ఇన్నింగ్స్ బహుశా ఇదే కావొచ్చు. కానీ, 230 పరుగులు పెద్ద లక్ష్యమేమీ కాదు. పిచ్ కూడా బ్యాటింగ్‌కు అనుకూలంగానే ఉంది. కానీ, మా బ్యాటర్లు విఫలమయ్యారు. బ్యాటింగ్ వైఫల్యం వల్లే ఈ మ్యాచ్‌లో ఓడిపోయామ``ని రోహిత్ వ్యాఖ్యానించాడు.
ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ను కేవలం 246 పరుగులకే ఆలౌట్ చేసిన టీమిండియా మొదటి ఇన్నింగ్స్‌లో 436 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో ఓలీ పోప్ (196) అద్భుత ఇన్నింగ్స్ ఆడడంతో ఇంగ్లండ్ 420 పరుగులు చేసి భారత్ ముందు 231 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. అయితే ఇంగ్లండ్ స్పిన్నర్ టామ్ హార్ట్‌లీ 7 వికెట్లతో భారత్ పతాన్ని శాసించాడు. దీంతో భారత్ 202 పరుగులకు ఆలౌట్ అయింది.
Updated Date - Jan 28 , 2024 | 08:52 PM