ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Unlimited 5G data: వినియోగదారులకు షాక్! అన్‌లిమిటెడ్ 5జీ ప్లాన్స్‌కు గుడ్ బై చెప్పనున్న జియో, ఎయిర్‌టెల్?

ABN, Publish Date - Jan 14 , 2024 | 05:09 PM

మొబైల్ వినియోదారులకు షాకిచ్చేందుకు దేశీయ టెలికాం సంస్థలు సిద్ధమవుతున్నాయా? అపరమిత 5జీ సేవలను ఉపసంహరించుకోబోతున్నాయా? అవును.. దిగ్గజ టెలికాం సంస్థలైన జియో, ఎయిర్‌టెల్ అన్‌లిమిటెడ్ 5జీ సేవలను ఉపసంహరించుకునేందుకు రంగం సిద్ధం చేస్తున్నాయట.

మొబైల్ వినియోదారులకు షాకిచ్చేందుకు దేశీయ టెలికాం సంస్థలు సిద్ధమవుతున్నాయా? అపరమిత 5జీ సేవలను ఉపసంహరించుకోబోతున్నాయా? అవును.. దిగ్గజ టెలికాం సంస్థలైన జియో, ఎయిర్‌టెల్ అన్‌లిమిటెడ్ 5జీ (Unlimited 5G data) సేవలను ఉపసంహరించుకునేందుకు రంగం సిద్ధం చేస్తున్నాయట. ఆదాయాన్ని పెంచుకునే ఉద్దేశంతో ప్రస్తుత 4 జి టారిఫ్ కంటే 10% అధికంగా ఛార్జీలు వసూలు చేయబోతున్నాయట (Charges Hike).

రిలయన్స్ జియో (Reliance Jio), భారతీ ఎయిర్ టెల్ (Bharti Airtel) సంస్థలు 2022 అక్టోబర్ నుంచి భారత దేశంలో 5జీ సేవలను ప్రారంభించాయి. ప్రస్తుత 4 జీ టారిఫ్‌తోనే అపరిమిత 5జి సేవలను కూడా అందిస్తున్నాయి. అయితే ఈ ఏడాది ద్వితియార్థం నుంచి ఆ సేవలకు డబ్బులు వసూలు చేయబోతున్నాయట. 4జీతో పోల్చుకుంటే 10 శాతం ఎక్కువగా 5జీ టారిఫ్‌ను వసూలు చేసే యోచన చేస్తున్నాయట. ప్రస్తుతం జియో, ఎయిర్‌టెల్ కంపెనీలకు సంయుక్తంగా 12.5 కోట్లకు పైగా 5జీ వినియోగదారులు ఉన్నారు. ఈ ఏడాది చివరి నాటికి ఆ సంఖ్య 20 కోట్లు దాటుతుందని అంచనా.

అప్పటికి తమ 5జి సేవలను దేశవ్యాప్తంగా మరింత విస్తరించాలని, మరింత మందిని ఆకర్షించాలని ఈ సంస్థలు ప్లాన్ చేస్తున్నాయి. అందుకోసం అవసరమైతే 30-40% అదనపు డేటాను అందించవచ్చని సమాచారం. కాగా, 2021 నవంబర్‌లో టెలికాం కంపెనీలు తమ టారిఫ్ రేట్లను పెంచాయి. అప్పట్నుంచి అదే రేట్లను కొనసాగిస్తున్నాయి. 5జీ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చాక మరో 10శాతం రేట్లు పెంచుకునేందుకు ప్రణాళికలు రచిస్తున్నాయి.

Updated Date - Jan 14 , 2024 | 05:09 PM

Advertising
Advertising