భర్త మృతదేహం పక్కనే కూర్చుని ఏడుస్తున్న భార్య.. కోడలి ప్రవర్తనపై అత్తింట్లో డౌట్.. పోస్ట్‌మార్టం చేయిస్తే..

ABN , First Publish Date - 2022-05-13T22:18:27+05:30 IST

వివాహేతర సంబంధాలు చివరికి విషాదాంతం అవుతాయనే విషయం అందరికీ తెలుసు. కానీ చాలా మంది తప్పులు మీద తప్పులు చేస్తుంటారు. తద్వారా సవ్యంగా సాగుతున్న సంసారంలో అనుకోని...

భర్త మృతదేహం పక్కనే కూర్చుని ఏడుస్తున్న భార్య.. కోడలి ప్రవర్తనపై అత్తింట్లో డౌట్.. పోస్ట్‌మార్టం చేయిస్తే..
ప్రతీకాత్మక చిత్రం

వివాహేతర సంబంధాలు చివరికి విషాదాంతం అవుతాయనే విషయం అందరికీ తెలుసు. కానీ చాలా మంది తప్పులు మీద తప్పులు చేస్తుంటారు. తద్వారా సవ్యంగా సాగుతున్న సంసారంలో అనుకోని సమస్యలు వచ్చిపడుతుంటాయి. ఘజియాబాద్‌లో ఇటీవల ఓ విషాధ ఘటన వెలుగులోకి వచ్చింది. భర్త మృతదేహం పక్కనే కూర్చుని ఏడుస్తున్న భార్యను చూసి అంతా.. అయ్యో పాపం.. అని అనుకున్నారు. అయితే కోడలి ప్రవర్తనపై అనుమానం రావడంతో అత్తమామలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోస్టుమార్టం చేయగా షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఏం జరిగిందంటే..


ఢిల్లీ సమీపంలోని ఘజియాబాద్‌లో రాకేష్, కుసుమ్ దంపతులు నివాసం ఉంటున్నారు. దంపతులిద్దరూ అన్యోన్యంగా జీవించేవారు. అయితే వారి జీవితంలో అనుకోని సమస్యలు వచ్చిపడ్డాయి. కుసుమ్‌కు మనోజ్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది. భర్త లేని సమయంలో కుసుమ్.. ప్రియుడితో కలుస్తూ ఉండేది. అయితే భర్త అడ్డు తొలగించుకుంటే రోజూ కలుసుకోవచ్చని కుసుమ్, ఆమె ప్రియుడు కుట్రపన్నారు. మే 1వ తేదీన ఉప్పులో మత్తు మందు కలిపి అన్నంలో కలిపి భర్తకు పెట్టింది. అది తిన్న కొద్ది సేపటికే అతడు అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. తర్వాత ప్రియుడి సాయంతో భర్తను హత్య చేసింది. రాకేష్ అనారోగ్య కారణంగా మృతి చెందాడని అత్తమామలకు సమాచారం అందించింది.

ప్రియుడికి వేరే అమ్మాయితో పెళ్లి ఫిక్స్.. పెట్రోల్‌ బాటిల్‌తో సహా ఆ ప్రేయసి నేరుగా అతడి ఇంటికెళ్లి..


తర్వాత రాకేష్ మృతదేహాన్ని అతడి స్వగ్రామం బులంద్‌షహర్‌కు తీసుకెళ్లారు. ఇదిలావుండగా భర్త మృతదేహం పక్కన కూర్చుని విలపిస్తున్న కుసుమ్‌ను చూడగానే.. రాకేష్ కుటుంబ సభ్యులకు అనుమానం కలిగింది. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్నారు. రాకేష్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. రాకేష్ తిన్న ఆహారంలో మత్తు మందు కలిపినట్లు పోస్టుమార్టం రిపోర్టులో తేలింది. దీంతో మృతుడి భార్య కుసుమ్‌, ఆమె ప్రియుడిని అరెస్ట్ చేశారు. ఈ వార్త స్థానికంగా సంచలనం కలిగించింది.

పెళ్లయినప్పటి నుంచి దిగులుగా ఉంటున్న యువతి.. మూడు నెలల తర్వాత.. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి...

Read more