అలంపూరు అభివృద్ధికి నిరంతరం కృషి

ABN , First Publish Date - 2022-05-05T05:05:56+05:30 IST

నియోజకవర్గ కేంద్రమైన అలంపూరు అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తామని ఎమ్మెల్యే అబ్రహాం అన్నారు.

అలంపూరు అభివృద్ధికి నిరంతరం కృషి
సీసీ రోడ్డు పనులను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే అబ్రహాం

-ఎమ్మెల్యే అబ్రహాం 

- సీసీ రోడ్లు, వైకుంఠధామం పనులు ప్రారంభం

అలంపూరు, మే 4 : నియోజకవర్గ కేంద్రమైన అలంపూరు అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తామని ఎమ్మెల్యే అబ్రహాం అన్నారు. పట్టణంలోని మెయిన్‌ బజార్‌లో రూ.44లక్షల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్డు, అక్బర్‌పేట కాలనీలో రూ.25 లక్షల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్డు, తుంగభద్ర నది సమీపంలో కోటి రూపాయల వ్యయంతో నిర్మించనున్న వైకుంఠ ధామం పనులను బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ మనోరమ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లా డారు. పట్టణంలో 25 సంవత్సరాల క్రితం వేసిన రోడ్లు పూర్తిగా దిబ్బతిన్న విషయాన్ని సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ల దృష్టికి తీసుకెళ్లి, నిధుల మంజూరుకు కృషి చేశామన్నారు. అలంపూరు, వడ్డేపల్లి మునిసిపాలిటీల అభివృద్ధికి ఐదు కోట్ల రూపాయల చొప్పున ప్రభుత్వం మంజూరు చేసిందని తెలిపారు. ఆ మునిసిపాలిటీల్లో రూ.1.50 కోట్ల వ్యయంతో నూతన భవనాలను నిర్మించ నున్నట్లు తెలిపారు.  అలంపూరులో అసంపూర్తిగా ఉన్న షాదీఖానాకు ప్రత్యేక నిధులు కేటాయించి, పూర్తి చేయిస్తామని హామీ ఇచ్చారు. వైకుంఠధామం పను లను త్వరితగతిన పూర్తి చేయించాలని అధికారులు, కాంట్రాక్టర్లను ఆయన ఆదేశించారు. అలంపూర్‌లో అభివృద్ధి పనులకు ప్రత్యేక నిధులు కేటాయించి పూర్తి చేయిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో వైస్‌ చైర్మన్‌ శేఖర్‌ రెడ్డి, మునిసిపల్‌ కమిషనర్‌ నిత్యానంద్‌, కౌన్సిలర్లు సుదర్శన్‌ గౌడ్‌, లక్ష్మీదేవి, సుష్మ, జయరాజు, టీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు వెంకట్రామయ్య శెట్టి, పీఏసీఎస్‌ అధ్యక్షుడు మోహన్‌ రెడ్డి, ఆలయ మాజీ ధర్మకర్త సరయి నాగరాజు, మాజీ చైర్మన్‌ నారాయణ రెడ్డి, కో ఆప్షన్‌ మెంబర్‌ అల్లబకాష్‌ తదితరులు పాల్గొన్నారు.  

Read more