Advertisement
Advertisement
Abn logo
Advertisement

పచ్చడి

కావలసినవి: పండు మిరపకాయలు - 100గ్రాములు, చింతపండు - ఒక టేబుల్‌స్పూన్‌, నూనె - సరిపడా, ఆవాలు - ఒక టీస్పూన్‌, ఇంగువ - చిటికెడు, మెంతి పొడి - అర టీస్పూన్‌, ఉప్పు - రుచికి తగినంత. 


తయారీ విధానం: ముందుగా పండు మిరపకాయల తొడిమెలు తీసి, శుభ్రంగా కడిగి ఆరబెట్టుకోవాలి.  స్టవ్‌పై పాన్‌ పెట్టి కొద్దిగా నూనె వేసి, కాస్త వేడి అయ్యాక మిరపకాయలు వేసి చిన్నమంటపై రెండు నిమిషాల పాటు వేగించి పక్కన పెట్టుకోవాలి. చల్లారిన తరువాత మిక్సీలో వేసి గ్రైండ్‌ చేసుకోవాలి. తరువాత చింతపండు, తగినంత ఉప్పు వేసి మరోసారి గ్రైండ్‌ చేసుకుంటే మెత్తటి పేస్టులా అవుతుంది. ఇప్పుడు స్టవ్‌పై పాన్‌ పెట్టి నూనె వేసి ఆవాలు వేసి వేగించాలి. ఇంగువ వేయాలి. తరువాత చింతపండు, పండు మిర్చి పేస్టు వేయాలి. కాసేపు వేగించి దింపాలి. ఈ పచ్చడి చపాతీ, దోశ లేదా అన్నంలోకి ఎంతో రుచిగా ఉంటుంది.

పటిశప్త ఉందియువెజ్‌ లాలీపాప్‌చైనీస్‌ ఫైవ్‌ స్పైస్‌ రైస్‌పెరుగు శాండ్‌విచ్‌కశ్మీరీ కహ్వా టీపనీర్‌ వెర్మిసెల్లీ బాల్స్‌చిల్లీ-ఆనియన్‌ క్రాకర్స్‌పత్తర్‌ కా ఘోష్‌లేడీ ఫింగర్‌ (బిస్కెట్‌)
Advertisement

నవ్య మరిన్ని