Abn logo

డుబ్కీ వాలే ఆలూ

వీకెండ్‌ విందు

వీకెండ్‌లో మంచి రెస్టారెంట్‌కు వెళ్లాలి... నార్త్‌ ఇండియన్‌ వంటకాలను టేస్ట్‌ చేయాలి... ఈ వారం ఇది మీ ప్లాన్‌ అయితే ఆ రెసిపీలను ఇంట్లోనే ట్రై చేయండి. బేబీ కార్న్‌ బటర్‌ మసాలా, హరియాలి పనీర్‌ టిక్కా మసాలా, క్యాలీఫ్లవర్‌ పనీర్‌ కోఫ్తా, డుబ్కీ వాలే ఆలూ, షాహీ బిండీ... వంటలు కచ్చితంగా మీ జిహ్వ చాపల్యాన్ని తీరుస్తాయి.


కావలసినవి: బంగాళదుంపలు - ఆరు, టొమాటో - ఒకటి, ధనియాల పొడి - రెండు టీస్పూన్లు, కారం - రెండు టీస్పూన్లు, పసుపు - అర టీస్పూన్‌, ఎండుమామిడి పొడి - ఒక  టీస్పూన్‌, అల్లం - చిన్నముక్క, మెంతులు - అర టీస్పూన్‌, జీలకర్ర - ఒక టీస్పూన్‌, ఎండుమిర్చి - నాలుగు, మెంతి ఆకులు - కొద్దిగా, ఇంగువ - చిటికెడు.


తయారీ విధానం: ముందుగా బంగాళదుంపలను ఉడికించి చిన్న చిన్న ముక్కలుగా కట్‌ చేసుకోవాలి. స్టవ్‌పై పాన్‌ పెట్టి నూనె వేసి కాస్త వేడి అయ్యాక జీలకర్ర, ఎండుమిర్చి వేసి వేగించాలి. తరువాత మెంతులు, ఇంగువ, అల్లం వేసి మరికాసేపు వేగనివ్వాలి. ఇప్పుడు టొమాటో ముక్కలు వేసి మూడు నాలుగు నిమిషాల పాటు ఉడికించాలి. టొమాటోలు మెత్తగా ఉడికిన తరువాత ధనియాలపొడి, కారం, పసుపు వేసి కలుపుకోవాలి. ఉడికించి పెట్టుకున్న బంగాళదుంపలు వేయాలి. గ్రేవీ కావాలనుకుంటే కొద్దిగా నీళ్లు పోసుకోవచ్చు. చిన్న మంటపై 5నిమిషాలు ఉడికించుకున్న తరువాత మెంతి ఆకులు వేసి దింపుకోవాలి. కొత్తిమీరతో గార్నిష్‌ చేసుకోవాలి. పూరీ లేదా పరోటాతో కలిపి సర్వ్‌ చేసుకోవాలి. 

సోయా బీన్‌ ఆలూ కూర్మాకీటో బటర్‌ పనీర్‌ మునగకాయ థోరన్‌cauliflower కర్రీపనీర్‌ కోఫ్తే కా సలాన్‌షాహీ పనీర్‌మసూర్‌ దాల్‌ కర్రీవంకాయ కొత్తిమీర కారం కూరథాయ్‌ గ్రీన్‌ కర్రీషాహీ బిండీ
Advertisement