ఈదురుగాలుల బీభత్సం - నేలకొరిగిన చెట్లు

ABN , First Publish Date - 2022-05-04T06:13:23+05:30 IST

మండలంలో మంగళవారం సాయంత్రం ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. పండ్లతోటలకు నష్టం వాటిల్లింది. మామిడి, నేరేడు పండ్లు నేలరాలాయి.

ఈదురుగాలుల బీభత్సం - నేలకొరిగిన చెట్లు
నేలకొరిగిన మామిడి చెట్టు






తాడిమర్రి, మే3: మండలంలో మంగళవారం సాయంత్రం ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. పండ్లతోటలకు నష్టం వాటిల్లింది. మామిడి, నేరేడు పండ్లు నేలరాలాయి. తాడిమర్రికి చెందిన రైతు పా ర్నపల్లి ప్రభాకర్‌కు సంబంఽధించిన మామిడి, నేరేడు చెట్లు నేలకొరిగాయి. దీంతో నాలుగు టన్నుల దాకా మామిడికాయలు నేలరాలా యి. లక్ష్మన్న అనే రైతుకు సంబంధించిన మామిడిచెట్లు గాలికి పూర్తిగా పడిపోయా యి. మార్కెట్‌లో మామిడి ధరలు బాగా పలుకుతున్న నేపథ్యంలో ఈదురుగాలి వారికి రూ.లక్షల్లో నష్టాన్ని మిగిల్చింది.

Read more