నగ్న వీడియోలు రికార్డు చేసి యువకుడిని బ్లాక్ మెయిల్ చేసిన యువతి
ABN , First Publish Date - 2021-03-14T00:08:44+05:30 IST
ఫేస్బుక్లో వచ్చిన ఫ్రెండ్ రిక్వెస్ట్ ఆ యువకుడి కొంపముంచింది. స్నేహం పేరుతో ఆ యువకుడి జేబును...
హైదరాబాద్: ఫేస్బుక్లో వచ్చిన ఫ్రెండ్ రిక్వెస్ట్ ఆ యువకుడి కొంపముంచింది. స్నేహం పేరుతో యువకుడి జేబును ఓ యువతి గుల్ల చేసింది. రూ. 2 లక్షలు పోగొట్టుకుని పోలీస్ స్టేషన్ మెట్లెక్కాడు సదరు యువకుడు. వివరాల్లోకి వెళితే.. నగరంలోని ఓ యువకుడికి యువతి నుంచి ఫేస్ బుక్‌లో రిక్వెస్ట్ వచ్చింది. ఆ పరిచయం కాస్త చనువు పెంచింది. చివరికి సదరు యువకుడి నగ్న వీడియోలు రికార్డ్ చేసే వరకు వెళ్లింది. అప్పుడు అసలు రంగును బయటపెట్టింది యువతి. వీడియోలను అప్ లోడ్ చేస్తానంటూ బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టింది. దీంతో రెండు లక్షల రూపాయలు సమర్పించుకున్నాడు. యువతి బెదిరింపులు ఎక్కువ అవ్వడంతో చివరికి సైబర్‌క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.