మున్నూరుకాపులు అన్ని రంగాల్లో రాణించాలి

ABN , First Publish Date - 2022-05-09T05:42:09+05:30 IST

మున్నూరు కాపులు రాయకీయంగా, సామాజికంగా ఎదగాలని సం ఘం రాష్ట్ర అపెక్స్‌ కౌన్సిల్‌ కన్వీనర్‌ సర్దార్‌ పుటం పురుషోత్తం అన్నారు.

మున్నూరుకాపులు అన్ని రంగాల్లో రాణించాలి
మాట్లాడుతున్న సంఘం రాష్ట్ర నాయకుడు పురుషోత్తం

- సంఘం రాష్ట్ర అపెక్స్‌ కౌన్సిల్‌ కన్వీనర్‌ సర్దార్‌ పుటం పురుషోత్తం

హన్వాడ, మే 8 : మున్నూరు కాపులు రాయకీయంగా, సామాజికంగా ఎదగాలని సం ఘం రాష్ట్ర అపెక్స్‌ కౌన్సిల్‌ కన్వీనర్‌ సర్దార్‌ పుటం పురుషోత్తం అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రనికి వచ్చిన అయన సంఘం ముఖ్య నాయకులతో సమావేశం అయ్యారు.ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడారు. అందరు సంఘటితమై రాజకీయ వాటా సాధించాలన్నారు. త్వరలోనే కార్పొరేషన్‌ సాధించే దిశలో కార్యాచరణ చేశామన్నారు. సంఘం ద్వారా నిరుద్యోగులకు ఉద్యోగ కల్పనలో భాగంగా వృత్తినైపుణ్య శిక్షణ కోర్సులు రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిల్‌ సభ్యుడు విఠల్‌, రాష్ర అధ్యక్షుడు దేవయ్య, నాయకులు మాజీ జడ్పీటీసీ నరేందర్‌, సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొత్త లక్ష్మణ్‌ పాల్గొన్నారు.

మనిషికి నాగరికతను నేర్పిన సగరజాతి

- భగీరథ మహర్షి జయంతిలో రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌

పాలమూరు, మే 8 : మనిషికి నాగరికతను నేర్పిన సగర జాతి గొప్పదని రాష్ట్ర ఎక్సైజ్‌, క్రీడలు, సాంస్కృతిక, పర్యాటకశాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని సగర కమ్యూనిటీ హాలులో సగరవంశస్థుడు శ్రీ భగీరథ మహర్షి జయంతిని ఘనంగా నిర్వహించారు. భగీరథుడికి పూలమాలవేసి ప్రసంగించారు. సగర జాతి పట్టుదలకు మారుపేరు, ముఖ్యంగా భగీరథ మహర్షి తన తపస్సుతో దివి నుండి భువికి గంగతను తీసుకువచ్చి పట్టుదలకు మారుపేరుగా నిలిచారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా ఇంటింటికి తాగునీరందించేందుకు మిషన్‌ భగీరథ పథకం పేరు పెట్టిందన్నారు. కార్యక్రమంలో సగర సంఘం అధ్యక్షుడు ప్రణీల్‌చంద్ర, యూ.వెంకటేశ్వర్లు, జడ్పీటీసీ సభ్యుడు ఇంద్రయ్య, మునిసిపల్‌ చైర్మన్‌ కె.సి నరసింహులు, డీసీసీబీ ఉపాధ్యక్షులు కోరమోని వెంకటయ్య, కౌన్సిలర్‌ వనజ, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ అబ్దుల్‌ రహమాన్‌, రైతుబంధు అధ్యక్షుడు గోపాల్‌యాదవ్‌, బీసీ సంక్షేమ అధికారి ఇందిర, బుడ్డన్న, ఆంజనేయులు, ప్రేమసాగర్‌, రవి, హనుమంతు, గడ్డమీది కృష్ణ, చిన్నకిష్టయ్య, శ్రీధర్‌, భీమన్న, పల్లెచందర్‌, నారాయణ, అలివేలు పాల్గొన్నారు. 

Read more