హరియాలి పనీర్‌ టిక్కా మసాలా

ABN , First Publish Date - 2021-03-13T17:15:30+05:30 IST

పనీర్‌ - పావుకేజీ, సోంపు - ఒక టీస్పూన్‌, పచ్చిమిర్చి - రెండు, కొత్తిమీర - ఒకకట్ట, పుదీనా - ఒకకట్ట, టొమాటోలు - రెండు, అల్లం - చిన్నముక్క, దాల్చినచెక్క - చిన్నముక్క, యాలకులు - రెండు, బిర్యానీ ఆకు - ఒకటి, గరంమసాలా - అర టీస్పూన్‌, చాట్‌మసాల - అర టీస్పూన్‌, క్రీమ్‌ - పావుకప్పు, ఉప్పు - తగినంత, వెన్న - ఒక టేబుల్‌స్పూన్‌.

హరియాలి పనీర్‌ టిక్కా మసాలా

కావలసినవి: పనీర్‌ - పావుకేజీ, సోంపు - ఒక టీస్పూన్‌, పచ్చిమిర్చి - రెండు, కొత్తిమీర - ఒకకట్ట, పుదీనా - ఒకకట్ట, టొమాటోలు - రెండు, అల్లం - చిన్నముక్క, దాల్చినచెక్క - చిన్నముక్క, యాలకులు - రెండు, బిర్యానీ ఆకు - ఒకటి, గరంమసాలా - అర టీస్పూన్‌, చాట్‌మసాల - అర టీస్పూన్‌, క్రీమ్‌ - పావుకప్పు, ఉప్పు - తగినంత, వెన్న - ఒక టేబుల్‌స్పూన్‌.


తయారీ విధానం: ముందుగా పనీర్‌ను ముక్కలుగా కట్‌ చేసుకోవాలి. సోంపు, కొత్తిమీర, పుదీనా, అల్లం, పచ్చిమిర్చిని మిక్సీలో వేసి కొద్దిగా నీళ్లు పోసి పేస్టులా పట్టుకోవాలి. స్టవ్‌పై పాన్‌ పెట్టి కొద్దిగా వెన్న వేసి వేడి అయ్యాక దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, యాలకులు వేసి వేగించాలి. తరువాత టొమాటో ప్యూరీ వేసి ఉడికించాలి. ఇప్పుడు పేస్టులా పట్టుకున్న మసాల వేయాలి. తరువాత గరంమసాలా, చాట్‌ మసాల వేసి మూత పెట్టి ఐదు నిమిషాల పాటు ఉడికించాలి. తరువాత అందులో క్రీమ్‌, పనీర్‌ ముక్కలు వేసి కలుపుకోవాలి. రుచికి తగినంత ఉప్పు వేసుకుని రెండు, మూడు నిమిషాలు ఉడికించుకోవాలి. పనీర్‌ ముక్కలకు మసాల బాగా పట్టిన తరువాత స్టవ్‌పై నుంచి దింపుకొని సర్వ్‌ చేసుకోవాలి. నాన్‌ లేదా పుల్కాలోకి ఈ గ్రేవీ రుచిగా ఉంటుంది.


Read more