ఇలా చేస్తే స్టేటస్‌ చూసినా తెలీదు

ABN , First Publish Date - 2021-01-30T05:35:50+05:30 IST

ఏమిటి చూశారు, ఏమిటి తెలియదు అనే కదా మీ సందేహం. వాట్సా్‌పలో స్టేటస్‌ పెట్టుకోవడం తెలిసిందే కదా. అది ఎవరైనా చూస్తే మనం చెక్‌ చేస్తే తెలుస్తుంది.

ఇలా చేస్తే స్టేటస్‌ చూసినా తెలీదు

ఏమిటి చూశారు, ఏమిటి తెలియదు అనే కదా మీ సందేహం. వాట్సా్‌పలో స్టేటస్‌ పెట్టుకోవడం తెలిసిందే కదా. అది ఎవరైనా చూస్తే మనం చెక్‌ చేస్తే తెలుస్తుంది. పేర్లతో సహా ఎంత మంది చూశారో తెలుస్తుంది కదా! ఈ సెట్టింగ్స్‌ చేంజ్‌ చేస్తే ఎదుటివారికి మీరు వారి స్టేటస్‌ చూసినట్టు కూడా తెలియదు. ఒక్క మాటలో చెప్పాలంటే మీరు చూస్తారు... కాని సదరు వ్యక్తికి మాత్రం మీరు చూశారని తెలియదు. అది ఎట్లనిన..


 ముందు వాట్సా్‌పను ఓపెన్‌ చేయాలి.

తరవాత టాప్‌లో ఉండే మూడు చుక్కలపై క్లిక్‌ చేయాలి. 

సెట్టింగ్స్‌లోకి వెళ్ళాలి. చాలా ఆప్షన్స్‌ కనిపిస్తాయి. 

అక్కడ అకౌంట్‌ ఆప్షన్‌పై క్లిక్‌ చేయండి

తరువాత ఓ విండో ఓపెన్‌ అవుతుంది.

అందులో ప్రైవసీపై క్లిక్‌ చేయండి

తదుపరి రీడింగ్‌ రిసీట్స్‌ ఆప్షన్‌ కనిపిస్తుంది. టర్న్‌ ఆఫ్‌ చేయండి. అంతే, ఎవరి అకౌంట్‌ అయినా చూడవచ్చు. మీరు చూసినట్టు ఆ అకౌంట్‌ హోల్డర్‌కు మాత్రం తెలియదు. 


Read more