గంగూలీని దాటి చెత్త రికార్డు సొంతం చేసుకున్న కోహ్లీ

ABN , First Publish Date - 2021-03-13T18:26:19+05:30 IST

టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ రికార్డును కెప్టెన్ విరాట్ కోహ్లీ బద్దలు కొట్టాడు. శుక్రవారం ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టీ20లో కోహ్లీ ఈ రికార్డు సాధించాడు. అయితే ఇదేదో గొప్ప రికార్డు అనుకోకండి. అత్యంత..

గంగూలీని దాటి చెత్త రికార్డు సొంతం చేసుకున్న కోహ్లీ

ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ రికార్డును కెప్టెన్ విరాట్ కోహ్లీ బద్దలు కొట్టాడు. శుక్రవారం ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టీ20లో కోహ్లీ ఈ రికార్డు సాధించాడు. అయితే ఇదేదో గొప్ప రికార్డు అనుకోకండి. అత్యంత చెత్త రికార్డు. అంతర్జాతీయ మ్యాచ్‌లలో అత్యధికసార్లు డకౌట్ అయిన బ్యాట్స్‌మెన్‌గా ఇన్నాళ్లూ గంగూలీ పేరున ఉన్న రికార్డును శుక్రవారం నాటి మ్యాచ్‌తో కోహ్లీ తన పేరున రాసుకున్నాడు. ఇంగ్లండ్‌తో జరుగుతన్న 5 టీ20ల సిరీస్‌లో భాగంగా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో శుక్రవారం తొలి టీ20 జరిగింది. ఈ మ్యాచ్‌లో మొత్త 5 బంతులాడిన కోహ్లి పరుగులేమీ చేయకుండా డకౌట్‌గా వెనుతిరిగాడు. అదిల్ రషీద్ బౌలింగ్‌లో భారీ షాట్‌కి ప్రయత్నించి, కవర్స్‌లో క్రిస్ జోర్డాన్ చేతికి క్యాచ్‌‌గా చిక్కాడు. దీనితో కలుపుకుని కోహ్లీ ఇప్పటివరకు 14 సార్లు డకౌటైన బ్యాట్స్‌మెన్‌గా ఓ చెత్త రికార్డు నెలకొల్పాడు. ఈ రికార్డు ఇప్పటివరకు గంగూలీ(13 సార్లు) పేరున ఉండేది. ఇక గంగూలీ తరువాత మహేంద్ర సింగ్‌ ధోని 11 సార్లు, కపిల్‌ దేవ్‌ 10 సార్లు, మహ్మద్‌ అజారుద్దీన్‌ 8 సార్లు డకౌట్‌గా వెనుదిరిగారు. 



కాగా 5 టీ20ల సిరీస్‌లో భాగంగా అహ్మదాబాద్‌ స్టేడియంలో టీమిండియాతో జరిగిన తొలి టీ20లో ఇంగ్లండ్‌ ఘన విజయం సాధించింది. టీమిండియా నిర్దేశించిన 125 పరుగుల లక్ష్యాన్ని 8 వికెట్ల తేడాతో ఛేదించింది. సుందర్‌ వేసిన 15.3వ బంతిని మలన్‌ సిక్సర్‌గా మలిచడంతో ఇంగ్లండ్‌ విజయాన్ని కైవసం చేసుకుంది. ఇక రెండో టీ20 ఆదివారం జరగనుంది. ఈ మ్యాచ్ కూడా అహ్మదాబాద్ స్టేడియంలోనే జరగనుంది. తొలి మ్యాచ్ ఓడిపోయిన టీమిండియా ఈ మ్యాచ్‌లోనైనా గెలవాలని పట్టుదలగా ఉంది. ఇక ఇంగ్లాండ్ మాత్రం.. టెస్ట్ సిరీస్ పరాభవాన్ని టీ20 సిరీస్‌తో తీర్చుకోవాలని భావిస్తోంది. మరి రెండో టీ20లో అయినా కోహ్లీ ఫాంలోకి వస్తాడేమో చూడాలి.

Read more