హోరాహోరీగా బండలాగుడు పోటీలు

ABN , First Publish Date - 2022-05-06T05:19:28+05:30 IST

మండల కేంద్రంలో కొనసాగుతున్న ఈదమ్మ దేవర ఉత్సవాల్లో భాగంగా గురువారం పాల పండ్ల ఎద్దుల బండ లాగు పోటీలు, క్రికెట్‌ పోటీలు ఉత్కంఠభరితంగా కొనసాగాయి.

హోరాహోరీగా బండలాగుడు పోటీలు
పోటీలో బండను లాగుతున్న ఎద్దులు

- ఈదమ్మ దేవర ఉత్సవాల్లో భాగంగా నిర్వహణ

ఉండవల్లి, మే 5 : మండల కేంద్రంలో కొనసాగుతున్న ఈదమ్మ దేవర ఉత్సవాల్లో భాగంగా గురువారం పాల పండ్ల ఎద్దుల బండ లాగు పోటీలు, క్రికెట్‌ పోటీలు ఉత్కంఠభరితంగా కొనసాగాయి. బండలాగుడు పోటీలో 12 జతల ఎద్దులు పాల్గొన్నాయి. వాటిలో యనగండ్ల గ్రామానికి చెందిన ఎద్దులు మొదటి స్థానంలో నిలవగా, శివసేన రాష్ట్ర కార్యదర్శి రూ.50,000లను బహుమతిగా అందించారు. రోళ్లపాడు గ్రామానికి చెందిన ఎద్దుల జగకు ఏజీఆర్‌ పంక్షన్‌ హాల్‌, వరసిద్ధి వినాయక కాటన్‌ మిల్లు యజమానులు సంయుక్తంగా రూ.40,000 బహుమతిని అందించారు. మూడవ స్థానంలో నిలిచిన ఎస్‌.కొత్తూరు గ్రామానికి చెందిన ఎద్దులకు కొప్పునూర్‌ గ్రామానికి చెందిన బంకుమీది లోకేశ్వర్‌ రెడ్డి రూ.30,000 అందించారు. నాలుగవ స్థానాన్ని దక్కించుకున్న బుక్కాపురం గ్రామానికి చెందిన ఎద్దులకు కంచుపాడు గ్రామానిక చెందిన చెన్నకేశవులు రూ.20,000లు ఇచ్చారు. అన్ని బహుమతులను కర్నూలు, నంధ్యాల జిల్లాలకు చెందిన ఎద్దులే గెలుపొందడం విశేషం. రైతుసంఘం ఆధ్వర్యంలో మూడు రోజులపాటు కొనసాగిన ఈ పోటీల్లో పాల్గొన్న వారికి వరన్నగౌడు భోజన సౌకర్యం కల్పించారు. స్టేట్‌బ్యాంకు వారు నీటి సదుపాయం, చలువ పందిళ్లను సర్పంచు రేఖ ఏర్పాటు చేశారు. 


క్రికెట్‌ మ్యాచ్‌ విజేత కర్నూలు జట్టు

ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన క్రికెట్‌ పోటీలు 10 రోజుల పాటు హోరాహోరీగా కొనసాగాయి. గురువారం జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో కర్నూలు పట్టణానికి చెందిన బుల్లెట్‌బుల్స్‌ జట్టు, ఉండవల్లికి చెందిన గాంధీనగర్‌ జట్టుపై 24 పరుగుల తేడాతో విజయం సాధించింది. వారికి మండల కేంద్రానికి చెందిన సివిల్‌ ఇంజనీర్‌ వెంకట్‌ గౌడు మొదిల రూ.50,000 బహుమతిని అందించారు. రన్నర్‌ జట్టుకు అలంపూర్‌ చౌరస్తా ఎస్బీ ఆర్గానిక్స్‌ వారు రూ.30,000 అందజేశారు. మ్యాన్‌ ఆఫ్‌ ది సీరీస్‌గా శివ బహుమతి అందుకున్నారు. టోర్నమెంట్‌కు అవసరమైన క్రీడా సామగ్రిని ఉండవల్లిలోని కృష్ణవేణి పాఠశాల యాజమాన్యం సమకూర్చింది. 


Read more