మయన్మార్‌లో నిరసనలు మరింత ఉధృతం

ABN , First Publish Date - 2021-02-09T08:56:23+05:30 IST

మయన్మార్‌లో నిరసనలు మరింత ఉధృతం

మయన్మార్‌లో నిరసనలు మరింత ఉధృతం

మండాలేలో సైనిక శాసనాన్ని ప్రకటించిన మిలిటరీ


యాంగాంగ్‌, ఫిబ్రవరి 8: మయన్మార్‌లో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలంటూ దేశ ప్రజలు చేపట్టిన నిరసనలు మరింత ఉధృతమయ్యాయి. ఎప్పుడూ పెద్దగా నిరసన కార్యక్రమాలు జరగని నేపిడా నగరంలో కూడా ఆందోళనలు కొనసాగుతున్నాయి. నేపిడాతోపాటు రాజధాని యాంగాంగ్‌లో సోమవారం భారీ సంఖ్యలో ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలిపారు. మిలిటరీ తిరుగుబాటును వ్యతిరేకించాలని, మయన్మార్‌ను కాపాడాలంటూ నినాదాలు చేశారు. దీంతో నిరసనకారులపై పోలీసులు జల ఫిరంగుల్ని ప్రయోగించారు. మరోవైపు దేశంలోని రెండో అతిపెద్ద నగరమైన మండాలేలో వేలకొద్దీ ప్రజలు నిరసన ర్యాలీ నిర్వహించడంతో నగరంలోని పలు ప్రాంతాల్లో సైనిక శాసనాన్ని అమలు చేస్తున్నట్లు మిలిటరీ ప్రకటించింది. 

Read more