ట్విట్టర్ పిట్ట ఎందుకు స్పందించదు..?: రఘునందనరావు

ABN , First Publish Date - 2021-03-13T19:55:50+05:30 IST

జర్నలిస్టులపై ప్రేమ వలకబోసిన ట్విట్టర్ పిట్ట.. వారిని కత్తితో పొడిస్తే ఎందుకు స్పందించలేదు? అని బీజేపీ దుబ్బాక ఎమ్మెల్యే రఘునందనరావు ప్రశ్నించారు.

ట్విట్టర్ పిట్ట ఎందుకు స్పందించదు..?: రఘునందనరావు

హైదరాబాద్: జర్నలిస్టులపై ప్రేమ వలకబోసిన ట్విట్టర్ పిట్ట.. వారిని కత్తితో పొడిస్తే ఎందుకు స్పందించలేదు? అని బీజేపీ దుబ్బాక ఎమ్మెల్యే రఘునందనరావు ప్రశ్నించారు. కేటీఆర్, హరీష్‌రావుపై రఘనందనరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం రఘునందనరావు మీడియాతో మాట్లాడుతూ... ఆంధ్రా ప్రాంత కార్పొరేట్ కంపెనీలు,  పట్టభద్రుల ఓట్ల కోసమే వైజాగ్ స్టీల్ ఫ్లాంట్‌పై మంత్రి కేటీఆర్ ప్రేమ చూపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రైవేటీకరణ గురించి కేటీఆర్ మాట్లాడటం హ్యాస్యాస్పదంగా ఉందన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడు కేంద్రంపై విమర్శలు చేయటం కేటీఆర్‌కు అలవాటుగా మారిందని ధ్వజమెత్తారు. హరీష్‌రావు సిద్దిపేటకు మాత్రమే ఆర్థికమంత్రా? లేక తెలంగాణ రాష్ట్రానికా? అని రఘునందనరావు ప్రశ్నించారు. 


ఉద్యోగులతో పీఆర్సీపై చర్చించి సీఎం కేసీఆర్ ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారన్నారు. తెలంగాణకు కేంద్రం అన్యాయం చేస్తే.. పార్లమెంట్‌లో టీఆర్ఎస్ ఎంపీలు ఎందుకు మాట్లాడరు? అని రఘునందనరావు  ప్రశ్నించారు.  దుబ్బాక, జీహెచ్ఎంసీలో వచ్చిన ఫలితాలే ఎమ్మెల్సీ ఎన్నికల్లో సైతం పునరావృతమవుతాయని రఘునందనరావు ధీమా వ్యక్తం చేశారు. అసెంబ్లీలో బీజేపీకి సమయం ఇవ్వకపోతే స్పీకర్‌ను కూడా నిలదీస్తామని హెచ్చరించారు. గాంధేయ మార్గంలోనే తమ హక్కును సాధిస్తామని స్పష్టం చేశారు. కేంద్రం చేసిన సాయంపై సభలో చర్చకు సిద్ధమని టీఆర్ఎస్ నేతలకు రఘునందనరావు సవాల్ విసిరారు. మందబలంతో సభను నడిపితే కుదరదన్నారు. నిరుద్యోగభృతిపై సభలో ప్రభుత్వ వైఖరీని ఎండగడతామని స్పష్టం చేశారు. బైంసాలో గత ఘటనలకు కారణమైన వారిని కఠినంగా శిక్షించి ఉంటే శాంతి భద్రతలు బాగుండేవని రఘునందనరావు తెలిపారు. 

Read more