ABN ఆంధ్రజ్యోతి అధినేత రాధాకృష్ణతో రాహుల్ గాంధీ సమావేశం

ABN , First Publish Date - 2022-05-07T15:40:32+05:30 IST

ABN ఆంధ్రజ్యోతి అధినేత రాధాకృష్ణతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమావేశం అయ్యారు. మీడియా అధిపతులు, మేధావులు, తెలంగాణ ఉద్యమకారులతో భేటీలో భాగంగా Rahul ఆంధ్రజ్యోతి అధినేతతో..

ABN ఆంధ్రజ్యోతి అధినేత రాధాకృష్ణతో రాహుల్ గాంధీ సమావేశం

హైదరాబాద్: ABN ఆంధ్రజ్యోతి అధినేత రాధాకృష్ణతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమావేశం అయ్యారు. మీడియా అధిపతులు, మేధావులు, తెలంగాణ ఉద్యమకారులతో భేటీలో భాగంగా Rahul ఆంధ్రజ్యోతి అధినేతతో భేటీ అయ్యారు. హోటల్ తాజ్‌కృష్ణలో ఈ సమావేశం జరుగుతోంది. ఇదిలా ఉండగా.. శుక్రవారం వరంగల్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ మైదానంలో తెలంగాణ కాంగ్రెస్ ‘రైతు సంఘర్షణ సభ’ పేరుతో నిర్వహించిన భారీ బహిరంగ సభలో రాహుల్ ప్రసంగించిన సంగతి తెలిసిందే. ఈ సభ విజయవంతం కావడంతో తెలంగాణ కాంగ్రెస్ కేడర్ ఫుల్ జోష్‌లో ఉంది.



రేవంత్‌రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడిగా నియమితుడైన తర్వాత రాహుల్‌గాంధీతో సభ నిర్వహించడం ఇదే తొలిసారి. తొలి సభే విజయవంతం కావడంతో టీపీసీసీ వర్గాల్లో సంతృప్తి వ్యక్తమవుతోంది. పైగా సభకు వచ్చిన జనాన్ని ఉత్తేజితం చేసేలా రాహుల్‌గాంధీ ప్రసంగించారు. పార్టీ క్రమశిక్షణ, టీఆర్‌ఎస్‌తో పొత్తు ఉండబోదన్న స్పష్టత ఇచ్చే విషయంలో దూకుడుగా ఆయన ప్రసంగం కొనసాగింది. ఎస్సీ, ఎస్టీ వర్గాలను ఆకట్టుకోవడంపైనా రాహుల్‌గాంధీ దృష్టి పెట్టారు. రైతు సంఘర్షణ సభ తరహాలోనే ఆదివాసీ సభ ఒకటి ఉంటుందని ప్రకటించారు. ఎస్టీలకు పది శాతం రిజర్వేషన్‌ కల్పించాలన్న ప్రతిపాదనకూ మద్దతు ప్రకటించారు.



ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ సభకూ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి డుమ్మా కొట్టారు. శాసనసభలో మినహా పార్టీతో ఆయన ఎక్కడా సంబంధాలు కొనసాగించడంలేదు. గాంధీభవన్‌కూ ఆయన చాలా కాలంగా రావడంలేదు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ పార్టీని ఎదుర్కొనగలిగేది బీజేపీనేనంటూ ఇటీవల కాలంలో అనేకసార్లు వివాదాస్పద వ్యాఖ్యలూ చేశారు. అయితే ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకునే అధికారం ఏఐసీసీకే ఉంది. కానీ, శాసనసభలో సభ్యుల సంఖ్య, ఇతర కారణాల దృష్ట్యా ఉపేక్షిస్తూ వస్తోంది. తాజాగా రాహుల్‌ సభకూ డుమ్మా కొట్టడంతో రాజగోపాల్‌రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు ఉంటాయా అన్న చర్చ పార్టీ వర్గాల్లో నడుస్తోంది.

Read more