నేరాల సంఖ్య తగ్గించాలి

ABN , First Publish Date - 2022-05-12T05:29:45+05:30 IST

జిల్లాలో నేరాల సంఖ్యను తగ్గించేందుకు ప్రతీ పోలీసు ఉద్యోగి కృషి చేయాలని ఎస్పీ రంజన్‌ రతన్‌కుమార్‌ అన్నారు.

నేరాల సంఖ్య తగ్గించాలి
సిబ్బందికి ప్రశంసాపత్రాలు అందిస్తున్న ఎస్పీ రంజన్‌ రతన్‌కుమార్‌

- నేర సమీక్షా సమావేశంలో ఎస్పీ రంజన్‌ రతన్‌కుమార్‌

గద్వాల క్రైం, మే 11 : జిల్లాలో నేరాల సంఖ్యను తగ్గించేందుకు ప్రతీ పోలీసు ఉద్యోగి కృషి చేయాలని ఎస్పీ రంజన్‌ రతన్‌కుమార్‌ అన్నారు. జిల్లా పోలీస్‌ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన నేర సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. పోలీస్టేషన్లలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ పనులు పటిష్టంగా నిర్వహించాలని, పెండింగ్‌ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. కేసులను ఎప్పటికప్పుడు ఛేదించి బాఽధితులలో నమ్మకం పెంచుకోవాలని, కోర్టు విధులు నిర్వహించే అధికారులు సమర్థవంతంగా పనిచేయాలన్నారు. కమ్యూనిటీ పోలీసింగ్‌లో భాగంగా సీసీ కెమెరాల ప్రాముఖ్యతపై ప్రజలకు అవగాహనను కల్గించాలని సూచిం చారు. విధులపై పూర్తి అవగాహన కల్గి ఉండాలని అధికారులకు సూచించారు. విధుల్లో ప్రతిభ కనపర్చిన రిసెప్షన్‌, బ్లూకోల్ట్స్‌, పెట్రోకార్స్‌, సెక్షన్‌ ఇన్‌ చార్జి, స్టెషన్‌ రైటర్‌, కోర్టు డ్యూటీ, ట్రాఫిక్‌ సిబ్బందికి ప్రశంసాపత్రాలు అందించారు. సమావేశంలో డీఎస్పీ రంగస్వామి, సాయుధ దళ డీఎస్పీ ఇమ్మానియేల్‌, సిఐ షేక్‌ మహబూబ్‌ బాషా పాల్గొన్నారు.


Read more