నిలకడగా గంగూలీ ఆరోగ్యం
ABN , First Publish Date - 2021-01-30T09:23:46+05:30 IST
బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉంది. శుక్రవారం గంగూలీని ఐసీయూ నుంచి సాధారణ గదికి మార్చారు.
కోల్‌కతా: బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉంది. శుక్రవారం గంగూలీని ఐసీయూ నుంచి సాధారణ గదికి మార్చారు. ఛాతీలో నొప్పిగా ఉందని రెండ్రోజుల కిందట ఆస్పత్రిలో చేరిన గంగూలీకి గుండెలోని రెండు ధమనుల్లో పూడికలు ఉండడంతో గురువారం అతడికి రెండు స్టెంట్‌లు వేసిన సంగతి తెలిసిందే. గంగూలీ కోలుకుంటున్నట్లు అతనికి శస్త్ర చికిత్స చేసిన డాక్టర్లు అఫ్తాబ్ ఖాన్, అశ్విన్ మెహతా తెలిపారు.
ఒలింపిక్స్ నిర్వహిస్తాం: జపాన్ ప్రధాని
- టోక్యో: వచ్చే జూన్‌లో ప్రారంభం కావాల్సిన ఒలింపిక్స్ కరోనా మహమ్మారి కారణంగా రద్దవుతాయని వస్తున్న వార్తలను జపాన్ ప్రధాని యోషిహిడే సుగా ఖండించారు. విశ్వక్రీడలను సమర్థవంతంగా నిర్వహించి కొవిడ్-19 సృష్టించిన విపత్కర పరిస్థితులపై మానవాళి సాధించిన విజయంగా నిరూపించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన తెలిపారు. శుక్రవారం ఆన్‌లైన్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సులో పాల్గొన్న సందర్భంగా సుగా.. టోక్యో క్రీడల నిర్వహణపై స్పష్టమైన ప్రకటన చేశారు.