లక్ష్యం చేరని రుణాలు

ABN , First Publish Date - 2021-02-21T05:29:50+05:30 IST

ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో పంట రుణాల కోసం వారి గా లక్ష్యాలను నిర్ణయించినా పూర్తిస్థాయిలో మాత్రం రైతుల కు అందడంలేదు. నిర్ణయించిన లక్ష్యాల్లో కొంతమేరనే బ్యాంక ర్లు రుణాలు పంపిణీ చేస్తున్నారు.

లక్ష్యం చేరని రుణాలు

ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో రైతులకు పూర్తిస్థాయిలో అందని పంట రుణాలు

నిర్ణయించిన లక్ష్యం మేరకు రుణాలు ఇవ్వని బ్యాంకర్లు

నిజామాబాద్‌, ఫిబ్రవరి 20 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో పంట రుణాల కోసం వారి గా లక్ష్యాలను నిర్ణయించినా పూర్తిస్థాయిలో మాత్రం రైతుల కు అందడంలేదు. నిర్ణయించిన లక్ష్యాల్లో కొంతమేరనే బ్యాంక ర్లు రుణాలు పంపిణీ చేస్తున్నారు. బ్యాంకుల వారీగా లక్ష్యాల ను నిర్ణయించిన కొన్నింటిలో టార్గెట్‌లు పూర్తయిన మిగతా వాటిలో కావడంలేదు. ఆయా బ్యాంకుల పరిధిలో పూర్తిస్థాయిలో అవగాహన కల్పించకపోవడం వల్ల రైతులు కొత్తగా రుణాలు అందుకోవడంలేదు. ఉమ్మడి జిల్లాలో వానాకాలం, యాసంగికి నిర్ణయించిన లక్ష్యం ప్రకారం రైతులకు రుణాలు ఇవ్వలేదు. ఉమ్మడి జిల్లా పరిధిలో వానాకాలం, యాసంగి పంటల కోసం రుణాలు ఇచ్చేందుకు వార్షిక ప్రణాళికలు త యారు చేశారు. వానాకాలం, యాసంగి పంటలకు ఎంతమొత్తంలో ఇవ్వాలో నిర్ణయం తీసుకున్నారు. ఆయా బ్యాంకులకు లక్ష్యాలను కేటాయించారు. రుణమాఫీకి సంబంధం లేకుండా వా నాకాలం, యాసంగికి రైతులకు పంట రుణాలు స్కేల్‌ ఆ ఫ్‌ ఫైనాన్స్‌ ప్రకారం ఇవ్వాలని బ్యాంకర్ల సమావేశంలో నిర్ణ యం తీసుకున్నారు. ప్రతి ఎకరాకు అయ్యే పెట్టుబడి ఆధార ంగా ఆయా పంటలకు ఇచ్చే పంట రుణాలను నిర్ణయించారు. వానాకాలం నిర్ణయించిన లక్ష్యానికి అనుగుణంగా ఉమ్మ డి జిల్లా పరిధిలో రుణాలను ఇవ్వలేదు. నిర్ణయించిన లక్ష్యం లో 65 శాతం వరకే చేరుకున్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలో వానాకాలంలో ఎక్కువ మంది రైతులకు రుణాలు అవసరం ఉన్న బ్యాంకుల నుంచి చేయూత అందకపోవడంతో కొద్ది మందికే రుణాలు అందాయి. పంటల బీమా పథకం కూడా రుణాలు తీసుకున్నవారికే వర్తింప చేస్తుండడంతో తీసుకోని రైతులకు బీమా వర్తించడంలేదు. గ్రామాల్లో అందరి రైతుల కు పంట రుణాలు, బీమాపై వ్యవసాయ అధికారులు అవగాహన కల్పించిన బ్యాంకులో అనుకున్న మేరకు ఇవ్వకపోవ డం వల్ల ఇతర మార్గాల ద్వారా పెట్టుబడులు తెచ్చుకుని పం టలను వేశారు. 

నిజామాబాద్‌ జిల్లాలో రూ.2,054 కోట్లు లక్ష్యం

నిజామాబాద్‌ జిల్లాలో వానాకాలం, యాసంగి కలిపి 20 20-21 సంవత్సరంలో రూ.2,054 కోట్లు రుణాలగా ఇవ్వాలని నిర్ణయించగా రూ.1315.29 కోట్లు మాత్రమే రుణాలుగా అం దించారు. నిర్ణయించిన లక్ష్యంలో 64.04 శాతం మాత్రమే రు ణాలను అందజేశారు. రుణ పంపిణీ జూన్‌ నెల నుంచి ప్రారంభమవుతున్నా బ్యాంకర్లు మాత్రం జూలై, ఆగస్టు, సెప్టె ంబరు నెలలో మాత్రమే ఎక్కువగా రుణాలను అందిస్తున్నా రు. ఇతర నెలల్లో తక్కువగా ఇవ్వడం వల్ల ఎక్కువ మంది రైతులకు అందడంలేదు. వానాకాలంలో జూన్‌ నెలకు ముం దే రైతులు పెట్టుబడుల కోసం ఎదురుచూస్తారు. వర్షాలు మొదలుకాగానే విత్తనాలను వేస్తారు. ఆ సమయంలోనే దు న్నేందుకు, విత్తనాలు, ఎరువులు కోనేందుకు డబ్బుల అవస రం ఉంటుంది. విత్తనాలు వేసే సమయంలో కూలీల అవస రం ఉండడంవల్ల అప్పుడు కూడా డబ్బుల అవసరం ఎక్కువ గా ఉంటుంది. ఆ సమయంలో రుణాలు ఇవ్వకపోవడం వల్ల రైతులు ఇబ్బందులు పడ్డారు. ఇతర మార్గాల ద్వారా రుణాలు తీసుకుని పంటలను పూర్తిచేశారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆగస్టు చివరి నాటికే పంటల బీమా పథకం పూర్తవుతుంది. బ్యాంకుల ద్వారా రుణాలు తీసుకున్నవారికే బీమా పథకాన్ని వర్తింపచేస్తారు. ప్రతి సంవత్సరం అనుకు న్న సమయంలో రుణాలు అందకపోవడం వల్ల ఎక్కువ మ ందికి రావడంలేదు. జిల్లాలో ఈ యాసంగిలో రూ.1,368.04 కోట్లు రుణాలుగా ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించారు. నవంబ రులో మొదలైన యాసంగి పంటలు ఏప్రిల్‌లో పూర్తవుతా యి. జిల్లాలో ఇప్పటి వరకు 616.35 కోట్ల రూపాయలను రు ణాలుగా ఇచ్చారు. యాసంగిలో కూడా ఎక్కువ మంది రైతు లకు డిసెంబర్‌, జనవరి నెలల్లోనే పెట్టుబడి ఎక్కువగా అవ సరం ఉంటుంది. ఆ సమయంలో అందకపోవడం వల్ల ఇతర మార్గాల ద్వారా ఏర్పాట్లను చేసుకున్నారు. 

కామారెడ్డి జిల్లాలోనూ ఇదే పరిస్థితి

కామారెడ్డి జిల్లా పరిధిలోనూ ఇదే పరిస్థితి ఉంది. ఈ జిల్లా పరిధిలో కూడా నిర్ణయించిన లక్ష్యాలకు అనుగుణంగా రుణ పంపణీ జరగలేదు. కొన్ని బ్యాంకులు లక్ష్యాలను సాధించిన మిగతా బ్యాంకుల పరిధిలో అనుకున్న విధంగా ఇవ్వలే దు. కామారెడ్డి జిలల్లాలో వానాకాలంలో రూ.1,461 కోట్లు రు ణాలుగా ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించగా రూ.1,009 కోట్లు ఇచ్చారు. అనుకున్న లక్ష్యాన్ని చేరలేదు. ఈ యాసంగిలో రూ. 907 కోట్లు రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించగా ఇప్పటి వరకు రూ.438 కోట్లు ఇచ్చారు. ఈ జిల్లా పరిధిలో కూడా రైతులు ఇతర మార్గాల ద్వారా రుణాలు తెచ్చుకుని పంటల ను పూర్తిచేశారు. ఉభయ జిల్లాల కలెక్టర్లు పంట రుణాలపై న ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అధికారులకు ఆదేశాలు ఇచ్చి నా కిందిస్థాయిలో బ్యాంకుల శాఖల అధికారులు సహకరించకపోవడం వల్ల లక్ష్యాలు నెరవేరలేదు. బ్యాంకర్ల సమావేశాల్లో తీసుకున్న నిర్ణయా నికి అనుగుణంగానే రుణ పంపిణీ చేస్తున్నామని లీడ్‌ బ్యా ంక్‌ మేనేజర్‌ జయసంతో షి తెలిపారు. యాసంగి లో కూడా అనుకున్న వి ధంగా రుణ పంపిణీ చే స్తామని ఆమె తెలిపా రు. వానాకాలం మాదిరిగా కాకుండా యాసంగి లో లక్ష్యానికి అనుగుణం గా రుణ పంపిణీ చేస్తే నే ఉభయ జిల్లాల రైతులకు మేలు జరిగే అవకా శం ఎంతైనా ఉంది.

Read more