-
-
Home » Prathyekam » The clash between the youngsters while dancing at the wedding cer spl-MRGS-Prathyekam
-
Viral Video: పెళ్లి వేడుకలో మహిళతో డాన్స్ చేస్తున్నాడో వ్యక్తి.. వారిద్దరి మధ్యలో ఓ కుర్రాడి ఎంట్రీ.. చివరకు..
ABN , First Publish Date - 2022-05-14T02:10:16+05:30 IST
సరదా జరుగుతున్న కార్యక్రమంలో ఒక్కోసారి అనుకోని ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఇలాంటి ఘటనలు ఎక్కువగా మద్యం మత్తులో జరుగుతుంటాయి. కొందరు ఆకతాయిల చేష్టలు...
సరదా జరుగుతున్న కార్యక్రమంలో ఒక్కోసారి అనుకోని ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఇలాంటి ఘటనలు ఎక్కువగా మద్యం మత్తులో జరుగుతుంటాయి. కొందరు ఆకతాయిల చేష్టలు అవతలి వారికి ఎక్కడ లేని కోపం తెప్పిస్తుంటాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియోలో కూడా ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. పెళ్లి వేడుకలో అంతా ఓ వ్యక్తి మహిళతో డాన్స్ చేస్తున్నాడు. వీరి మధ్యలో ఓ కుర్రాడు ఎంటరవడంతో అసలు సమస్య మొదలైంది.
యూట్యూబ్‌లో వైరల్ అవుతున్న వీడియోలో ఓ వివాహ కార్యక్రమంలో అంతా సరదాగా సరదాగా గడుపుతుంటారు. ఈ సందర్భంగా కొందరు యువకులు డాన్స్ చేస్తూ ఉంటారు. అదే సమయంలో ఓ వ్యక్తి మహిళను చేయి పట్టి అక్కడికి తీసుకొచ్చి.. ఆమెతో పాటూ డాన్స్ చేస్తాడు. మహిళతో పాటూ డాన్స్ చేస్తుండగా మధ్యలో ఓ కుర్రాడు ఎంటరవుతాడు. ఆ వ్యక్తిని బలవంతంగా ఎత్తుకుని, డాన్స్ చేసేందుకు ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో కింద పడేసేందుకు ప్రయత్నిస్తాడు.
ప్రేయసిని కలిసేందుకు వెళ్తే.. దగ్గరుండి మరీ పెళ్లి చేసి పంపించిన గ్రామస్తులు.. ఇంతకీ అసలేం జరిగిందంటే..
తర్వాత ముఖం మీద గట్టిగా కొడతాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవ మొదలవుతుంది. ఈ కారణంగా అప్పటిదాకా ఆహ్లాదకరంగా సాగిన కార్యక్రమంలో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. దీంతో మధ్యలో కొందరు కలుగజేసుకుని సర్దిచెప్పేందుకు ప్రయత్నిస్తారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్లు పెడుతున్నారు.