-
-
Home » Prathyekam » The man who sold the single potato chip piece for Rs 163 lakh spl-MRGS-Prathyekam
-
ఒకే ఒక్క పొటాటో చిప్ పీస్ ధర ఏకంగా రూ.1.63 లక్షలు.. ఇంత ఖరీదేంటని ఆశ్చర్యపోతున్నారా..?
ABN , First Publish Date - 2022-05-14T21:59:09+05:30 IST
మాములుగా ఓ చిప్స్ ఖరీదు ఎంతుంటుంది...? మహా అయితే... ఒక ప్యాకెట్ 5 రూపాయలు, లేదంటే పది రూపాయలు ఉంటుంది. పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్‌లో అయితే రూ.100కు మించి...
మాములుగా ఓ చిప్స్ ఖరీదు ఎంతుంటుంది...? మహా అయితే... ఒక ప్యాకెట్ 5 రూపాయలు, లేదంటే పది రూపాయలు ఉంటుంది. పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్‌లో అయితే రూ.100కు మించి ఉండదు.. అది కూడా మొత్తం ప్యాకెట్. కానీ సింగిల్ పొటాటో పీస్‌ను అమ్మడం మీరెక్కడైనా చూశారా..? ఓ వ్యక్తి సింగిల్ పొటాటో పీస్‌ను లక్షా 63 వేలకు ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెట్టాడు. వినడానికి షాకింగ్‌గా ఉన్నా ఇది నిజం..
ఇంగ్లండ్‌లోని బకింగ్‌హామ్‌షైర్‌కు చెందిన ఓ వ్యాపారి.. పొటాటో చిప్ సింగిల్ పీస్‌ను అమ్మకానికి పెట్టాడు. అది కూడా ఈ కామర్స్ కంపెనీ ఈబేలో. ఆ సింగిల్ పీస్‌ను 2 వేల యూరోలకు అమ్మకానికి ఉంచాడు. అంటే మన కరెన్సీలో లక్షా 63 వేల రూపాయలు. దీనిని పుల్లటి క్రీమ్, ఆనియన్ ఫ్లేవర్‌తో తయారు చేసినట్లు చెప్పాడు. దీని షేప్ చాలా ప్రత్యేకమైనదని... పైన ఒక అరుదైన మడత ఉంటుందని, ఇదొక సరికొత్త ప్రొడక్ట్ అని డిస్క్రిప్షన్‌లో రాశాడు. ఇది చూసిన కస్టమర్లకు మతిపోయింది. ఒక్క పొటాటో చిప్‌కు 2 వేల యూరోలు ఏంటని చర్చించుకుంటున్నారు. అయితే ఆహార పదార్థాలపై భారీ ధరలు ఉండడం ఇదే తొలిసారి కాదు.. ఇంతకు ముందు కూడా ఓ వ్యక్తి రెండు చిప్స్‌ను 50 యూరోలకు అమ్మకానికి పెట్టాడు. ఇటీవల మెక్ డొనాల్డ్‌కి చెందిన చికెన్ నగ్గెట్‌పై ఆన్‌లైన్‌లో బిడ్డింగ్ నిర్వహించగా.. ఓ వ్యక్తి ఏకంగా 73 లక్షలకు కొనుగోలు చేశాడు. దీని షేప్‌కి ఉన్న ప్రత్యేకత కారణంగానే అంత భారీ ధరకు అమ్ముడైనట్లు మెక్‌డొనాల్డ్స్ తెలిపింది. గతంలో గోల్డెన్ బర్గర్.. 4 లక్షల 62 వేలకు అమ్ముడైన విషయం తెలిసిందే.