సులువుగా హ్యాక్‌ అయ్యే పాస్‌వర్డ్‌లు ఇవే

ABN , First Publish Date - 2021-03-13T05:51:57+05:30 IST

‘పాస్‌వర్డ్‌’ అనే పదం టెక్నాలజీ యుగంలో ఒక కీ మంత్ర. పాస్‌వర్డ్‌ పటిష్టంగా లేకుంటే హ్యాకర్లు ఆయా వ్యక్తుల వ్యక్తిగత సమాచారాన్ని సులువుగా చోరీ చేయగలుగుతారు. దీంతో ఆర్థిక, సమాచార నష్టం వెలకట్టలేనట్లుగా ఉంటుంది

సులువుగా హ్యాక్‌ అయ్యే పాస్‌వర్డ్‌లు ఇవే

‘పాస్‌వర్డ్‌’ అనే పదం టెక్నాలజీ యుగంలో ఒక కీ మంత్ర.  పాస్‌వర్డ్‌ పటిష్టంగా లేకుంటే హ్యాకర్లు ఆయా వ్యక్తుల వ్యక్తిగత సమాచారాన్ని సులువుగా చోరీ చేయగలుగుతారు. దీంతో ఆర్థిక, సమాచార నష్టం వెలకట్టలేనట్లుగా ఉంటుంది. అయితే ఆ వాస్తవాన్ని చాలామంది తేలికగా తీసుకుంటుంటారు. సైబర్‌ సెక్యూరిటీ, బ్రాండ్‌ వాల్యూ రిపోర్ట్‌ ప్రకారం వంద వరకు వాల్యుబుల్‌ బ్రాండ్‌ వాల్యూలకు చెందిన డేటా చౌర్యానికి గురైందట. దాని విలువ 223 బిలియన్‌ డాలర్లు. గుండెలు బాదుకోవడానికి ఇంతకు మించిన వివరాలు అక్కర్లేదు. సంస్థ నుంచి వ్యక్తుల వరకు దేనికైనా పాస్‌వర్డ్‌ ఈ డిజిటల్‌ యుగంలో చాలా పకడ్బందీగా ఉండాలి. ఇక్కడ పేర్కొన్న ఈ 48 పాస్‌వర్డ్‌లు  కనీసంలో ఒక్కోటి యాభైవేల పర్యాయాలు హ్యాక్‌ అయ్యాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. అందుకే పాస్‌వర్డ్‌ ఎంపిక అనేది అత్యంత క్లిష్టంగా ఉండేలా చూసుకోవాలి.



Read more