ఈ ఛాట్‌ యాప్స్‌ ఫోన్‌ నంబర్‌ లేకుండా వాడొచ్చు

ABN , First Publish Date - 2021-01-30T05:46:04+05:30 IST

వినియోగదారుడి అవసరాలను క్యాష్‌ చేసుకోగలిగితేనే వ్యాపారమైనా, వ్యవహారమైనా విజయం దిశగా పరుగులు పెట్టగలుగుతుంది.

ఈ ఛాట్‌ యాప్స్‌ ఫోన్‌ నంబర్‌ లేకుండా వాడొచ్చు

వినియోగదారుడి అవసరాలను క్యాష్‌ చేసుకోగలిగితేనే వ్యాపారమైనా, వ్యవహారమైనా విజయం దిశగా పరుగులు పెట్టగలుగుతుంది. స్కామర్లు ఎత్తులకు పైఎత్తులు వేసి, అమాయకులను నిలువుదోపిడి చేస్తున్న రోజులు ఇవి. అపరిచితుడితో ఫోన్‌ నంబర్‌ షేర్‌ చేసుకోవడానికి జంకుతున్నారు. ప్రత్యేకించి 2020 నుంచి ఎదురవుతున్న విచిత్ర వైనమిది. ఈ నేపథ్యంలో  సెల్‌ నంబర్‌తో అవసరం లేకుండానే చాట్‌ చేసుకునే సదుపాయాన్ని ఈ ఏడు యాప్స్‌ కల్పిస్తున్నాయి. అవేంటో చూద్దాం.


వైర్‌ సెక్యూరింగ్‌ మెసేజ్‌: వినియోగదారుడు తన నంబర్‌ తెలియజేయకుండానే రహస్యంగా మాట్లాడుకునేందుకు ఈ యాప్‌ పక్కాగా ఉపయోగపడుతుంది. డెస్క్‌టాప్‌పై https://app.wire.com/ ఓపెన్‌ చేసి ఈమెయిల్‌ ఐడి సహకారంతో రిజిస్టర్‌ చేసుకోవచ్చు. అది ప్రైమరీ ఐడి కానవసరం లేదు. యూనిక్‌ ప్రొఫైల్‌ ఐడి ని క్రియేట్‌ చేసి పని కానిచ్చేయవచ్చు. సదరు యాప్‌ను ఫోన్‌లోకి డౌన్‌లోడ్‌ చేసుకుని రిజిస్టర్డ్‌  ఈమెయిల్‌తో  సైన్‌-ఇన్‌ కావచ్చు. ట్విట్టర్‌ మాదిరిగానే ప్రొఫైల్‌ ఐడి కలిగిన వ్యక్తులతో చాట్‌ చేయవచ్చు. 


టెలిగ్రామ్‌: ఆరంభంలో ఫోన్‌ నంబర్‌ అవసరమవుతుంది. అయితే ఫోన్‌ నంబర్‌ ఇవ్వకుండానే ప్రైవేటుగా చాట్‌ చేసుకోవచ్చు. ఫోన్‌ నంబర్‌ను సెట్టింగ్స్‌లో దాచిపెట్టి ప్రొఫైల్‌ ఐడిని సెటప్‌ చేసుకోవచ్చు. తరవాత ఫోన్‌ నంబర్‌ లేదంటే ఫొటో చూపకుండానే చాటింగ్‌ కొనసాగించవచ్చు. 


డిస్కార్డ్‌: పర్సనల్‌ డేటా ఇవ్వకుండానే రిజిస్టర్‌ చేసుకోవచ్చు. అదేవిధంగా ఉపయోగించుకోనూ వచ్చు. మొదట ప్రొఫైల్‌ని క్రియేట్‌ చేసుకుని, అందులో ఐడి కలిగి ఉన్న వ్యక్తులను కలుపుకోవచ్చు. దీనికి ఫోన్‌ నంబర్‌తో పనే లేదు. 


ప్రొటాన్‌ మెయిల్‌: ఎన్‌క్రిప్ట్‌డ్‌ ఈమెయిల్స్‌కు ఉపయోగపడుతుంది. ఊరూపేరూ లేకుండా ఈమెయిల్‌ పంపాలని అనుకుంటే ఇది బాగా ఉపయోగపడుతుంది. విపిఎన్‌ ఉపయోగించి మరింత ప్రైవసీని పొందవచ్చు. 


గూగుల్‌ మీట్‌: పూర్తిగా ప్రత్యేకంగా లింక్‌ కాని ఈమెయిల్‌ ఐడితో పని కానివ్వవచ్చు. మైక్రోసాఫ్ట్‌, గూగుల్‌ లేదంటే ఏదైనా బిగ్‌ టెక్‌ కంపెనీని ఉపయోగించుకుంటే మీప్రైవసీకి గ్యారంటీ ఏమీఉండదు. ఆన్‌లైన్‌ డేటింగ్‌ లేదంటే ఏమీ తెలియజేయకుండా అంత సెన్సివిటి లేని విషయాలు మాట్లాడుకునేందుకు గూగుల్‌ మీట్‌ను ఉపయోగించవచ్చు. 


స్కైప్‌: జస్ట్‌ ఐడితో వర్క్‌ చేసే ‘స్కైప్‌’ చాలాకాలంగా తెలిసిందే. టాక్‌, చాట్‌, వీడియో కాల్‌ వరకు ఉపయోగపడుతుంది. నంబర్‌ అవసరమే లేదు. నిజానికి ఇది ఓల్డ్‌ స్కూల్‌. బాగా పనిచేస్తుంది. షేరింగ్‌లో సెన్సిటివిటీ ఉంటే మాత్రం ‘స్కైప్‌’ మంచిది కాదు.  


ఇన్‌స్టాగ్రామ్‌: ఊరూపేరూ లేని అన్‌లింక్డ్‌ అకౌంట్‌ ఇది. సెపరేట్‌ ఈమెయిల్‌తో డెస్క్‌టాప్‌ నుంచి దీన్ని క్రియేట్‌ చేసుకోవచ్చు. ఫొటోలు యాడ్‌ చేయకపోవడమే మంచిది. ప్రొఫైల్‌ రూపొందించుకుని, ఐడి నంబర్‌తో ఛాటింగ్‌ చేసుకోవచ్చు. ఫోన్‌ నంబర్‌, ఫేస్‌బుక్‌ ప్రొఫైల్‌తో పనేలేదు.


Read more