-
-
Home » Prathyekam » What did the young woman do when the young man called and threatened her spl-MRGS-Prathyekam
-
పెళ్లిమంటపంలోనే వరుడిని చంపి.. నిన్ను తీసుకెళ్తా.. వధువుకు పక్కింటి యువకుడి ఫోన్‌కాల్.. చివరకు..
ABN , First Publish Date - 2022-05-14T22:48:06+05:30 IST
కొందరు చిన్న చిన్న సమస్యలకు కూడా తీవ్రంగా కుంగిపోతుంటారు. ఇలాంటి వారి బలహీనతను కొందరు అవకాశంగా తీసుకుని బెదిరింపులకు పాల్పడడం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి...
కొందరు చిన్న చిన్న సమస్యలకు కూడా తీవ్రంగా కుంగిపోతుంటారు. ఇలాంటి వారి బలహీనతను కొందరు అవకాశంగా తీసుకుని బెదిరింపులకు పాల్పడడం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి సందర్భాల్లో చాలా మంది మహిళలు.. తమ బాధను బయటికి చెప్పకోలేక సతమతమవుతుంటారు. ఈ క్రమంలో కొందరైతే అనూహ్య నిర్ణయాలు తీసుకుంటుంటారు. మధ్యప్రదేశ్‌లో ఓ యువతికి కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది. పెళ్లిమంటపంలోనే వరుడిని చంపి.. నిన్ను తీసుకెళ్తా.. అంటూ వధువును పక్కింటి యువకుడు ఫోన్ చేసి బెదిరించాడు. చివరకు ఏం జరిగిందంటే..
మధ్యప్రదేశ్ రాష్ట్రం ఛతర్‌పూర్ సిటీ పరిధిలోని బాక్యాన్ ఖిడ్కీ మార్గ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. రాజేష్ బన్ష్కర్, గిర్జా బన్ష్కర్ దంపతుల కుమార్తె నీలు బన్ష్కర్(22) వివాహ కార్యక్రమాన్ని మే 14న నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. అలాగే 15 ఊరేగింపు నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేశారు. బంధువులు, సన్నిహితులంతా గ్రామానికి చేరుకున్నారు. శుక్రవారం అంతా సరదా సరదాగా గడిపారు. శనివారం ఉదయం చూస్తే వధువు కనిపించలేదు. బయటికేమైనా వెళ్లిందేమో అని అంతా అనుకున్నారు. అయితే ఎంత సేపటికీ ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు కంగారుపడ్డారు. ఇంటి పరిసరాల్లో కనిపించకపోవడంతో గ్రామం మొత్తం వెతకడం మొదలెట్టారు. ఈ క్రమంలో గ్రామ సమీపంలోని చెరువు వద్ద ఫోన్ పడి ఉండడాన్ని కొందరు గమనించి సమాచారం అందించారు. దీంతో అంతా అక్కడికి వెళ్లి చెరువు మొత్తం వెతికారు.
చేతిలో పసిబిడ్డతో పోలీస్ స్టేషన్‌కు చేరుకుందో అమ్మాయి.. మైనర్ అయిన ఆమె చెప్పింది విన్న పోలీసులకు..
చివరకు అందులో వధువు మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వధువు ఇంటి పక్కన ఉండే యువకుడి బెదిరింపుల కారణంగానే.. నీలు ఆత్మహత్యకు పాల్పడినట్లు విచారణలో తెలిసింది. ఆ యువకుడు కొన్నాళ్లుగా ప్రేమ పేరుతో యువతిని వేధించేవాడు. వివాహం జరుగుతుందని తెలుసుకుని యువతికి ఫోన్ చేశాడు. పెళ్లి చేసుకుంటే.. వరుడిని మంటపంలోనే కాల్చి చంపి..నిన్ను ఎత్తుకెళ్తా’’.. అంటూ బెదిరించాడు. దీంతో వధువు తీవ్ర మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిసింది.