స్వీట్ సీడాయి
ABN, First Publish Date - 2019-08-24T18:28:34+05:30
బియ్యప్పిండి - ఒక కప్పు, మినప్పిండి - రెండు టేబుల్‌స్పూన్లు, బెల్లం - అరకప్పు, నీళ్లు - పావు కప్పు, వెన్న - ఒక టేబుల్‌స్పూన్, కొబ్బరిపొడి - ఒక టేబుల్‌స్పూన్,
కావలసినవి
బియ్యప్పిండి - ఒక కప్పు, మినప్పిండి - రెండు టేబుల్‌స్పూన్లు, బెల్లం - అరకప్పు, నీళ్లు - పావు కప్పు, వెన్న - ఒక టేబుల్‌స్పూన్, కొబ్బరిపొడి - ఒక టేబుల్‌స్పూన్, నువ్వులు - ఒక టీస్పూన్, నూనె - డీప్ ఫ్రైకి తగినంత, యాలకుల పొడి - చిటికెడు.
తయారీవిధానం
గోరు వెచ్చని నీటిలో బెల్లం వేసి నానబెట్టాలి. తరువాత కాస్త వేడి చేసి మిశ్రమం చిక్కగా అయ్యేలా చేసి పక్కన పెట్టాలి. పాన్ తీసుకొని బియ్యప్పిండి, మినప్పిండిని వేగించాలి. రంగు మారే వరకు కాకుండా కొద్దిసేపు వేగించుకుని పక్కన పెట్టాలి. తరువాత కొబ్బరిపొడి వేగించాలి. ఇప్పుడు ఒకపాత్రలో బియ్యప్పిండి, మినప్పిండి, కొబ్బరిపొడి, వెన్న, నువ్వులు, యాలకులపొడి వేసి కలుపుకోవాలి. తరువాత బెల్లం పానకం వేసి కలియబెట్టుకోవాలి. మెత్తగా కావాలనుకుంటే కొన్ని నీళ్లు కలుపుకోవచ్చు. అయితే మిశ్రమం బాగా పలుచగా కాకుండా చూసుకోవాలి. ఇప్పుడు చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఒకపాత్రలో నూనె వేసి వేడి అయ్యాక వాటిని వేసి వేగించాలి. ముదురుగోధుమ రంగు వచ్చే వరకు వేగించుకోవాలి. అంతే... రుచిగా ఉండే స్వీట్ సీడాయి రెడీ.
Updated Date - 2019-08-24T18:28:34+05:30 IST