చికెన్ షవర్మా రోల్
ABN, First Publish Date - 2019-11-16T18:03:31+05:30
చికెన్ - అరకిలో, పెరుగు - అరకప్పు, వెల్లుల్లి పేస్టు - ఒక టేబుల్‌స్పూన్, మిరియాల పొడి - అర టీస్పూన్, కర్రీ పౌడర్ - అర టీస్పూన్, దాల్చిన చెక్క పొడి - అర టీస్పూన్
కావలసిన పదార్థాలు: చికెన్ - అరకిలో, పెరుగు - అరకప్పు, వెల్లుల్లి పేస్టు - ఒక టేబుల్‌స్పూన్, మిరియాల పొడి - అర టీస్పూన్, కర్రీ పౌడర్ - అర టీస్పూన్, దాల్చిన చెక్క పొడి - అర టీస్పూన్, ఉప్పు - తగినంత, నిమ్మకాయలు - రెండు, నూనె - ఒక టీస్పూన్, ఉల్లిపాయలు - కొద్దిగా, పచ్చిమిర్చి, టొమాటో - రెండు, రుమాల్ రోటీ - నాలుగు.
సాస్ కోసం : పెరుగు - అరకప్పు, నిమ్మరసం - కొద్దిగా, తాహిని - ఒక టీస్పూన్, ఉప్పు - తగినంత, వెల్లుల్లి పేస్టు - ఒక టీస్పూన్.
తయారీ విధానం: ఒక పాత్రలో చికెన్ తీసుకొని పెరుగు, వెల్లుల్లి పేస్టు, మిరియాల పొడి, కర్రీపౌడర్, దాల్చిన చెక్క పొడి, తగినంత ఉప్పు, నిమ్మరసం వేసి బాగా కలిపి నాలుగు గంటల పాటు పక్కన పెట్టాలి.ఒక పాన్‌లో నూనె వేసి చికెన్ ముక్కలను వేగించాలి. ఇప్పుడు రుమాల్ రోటీని తీసుకుని మధ్యలో చికెన్ ముక్కలు, కట్ చేసి పెట్టుకున్న టొమాటో, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి రోల్ చేయాలి. మరొక పాత్రలో పెరుగు, నిమ్మరసం, తాహిని, ఉప్పు, వెల్లుల్లిపేస్టు వేసి బాగా కలిపి సాస్ తయారుచేసుకోవాలి. ఈ సాస్‌తో తింటే చికెన్ షవర్మా రుచిగా ఉంటుంది.
Updated Date - 2019-11-16T18:03:31+05:30 IST