చెట్టినాడ్ ఫిష్ ఫ్రై
ABN, First Publish Date - 2019-11-30T17:16:57+05:30
కింగ్ ఫిష్(వంజరం) - అరకిలో, నూనె - రెండు టేబుల్‌స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక టీస్పూన్, జీలకర్ర - ఒక టీస్పూన్, ధనియాలు - రెండు టీస్పూన్లు, మిరియాలు
కావలసిన పదార్థాలు: కింగ్ ఫిష్(వంజరం) - అరకిలో, నూనె - రెండు టేబుల్‌స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక టీస్పూన్, జీలకర్ర - ఒక టీస్పూన్, ధనియాలు - రెండు టీస్పూన్లు, మిరియాలు - రెండు టీస్పూన్లు, ఆవాలు - అర టీస్పూన్, కరివేపాకు - కొద్దిగా, ఉప్పు - రుచికి తగినంత, టొమాటో - ఒకటి, కారం - ఒక టీస్పూన్, పసుపు - రెండు టీస్పూన్లు, చింతపండు - కొద్దిగా, మొక్కజొన్న పిండి - ఒక టేబుల్‌స్పూన్.
తయారీ విధానం: ముందుగా చేపలను శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒకపాన్‌లో జీలకర్ర, ధనియాలు, మిరియాలు, ఆవాలు, కరివేపాకు వేసి వేగించాలి. తరువాత వీటిని మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి. తరువాత ఉప్పు, టొమాటో ముక్కలు, కారం, చింతపండు గుజ్జు, కొద్దిగా నీళ్లు పోసి మరొక్కసారి గ్రైండ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని చేప ముక్కలపై పోయాలి. తరువాత మొక్కజొన్న పండి చల్లుకోవాలి. మొక్కజొన్న పిండి చల్లడం వల్ల మసాలా చేప ముక్కకు పట్టుకుని ఉంటుంది. ఇప్పుడు ఈ చేప ముక్కలను పావుగంటపాటు ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి. తరువాత పాన్‌లో నూనె వేసి చేప ముక్కలను వేగించాలి. నిమ్మరసం పిండుకుని అన్నంతో లేదా చపాతీతో తింటే చెట్టినాడ్ ఫిష్ ఫ్రై టేస్టీగా ఉంటుంది.
Updated Date - 2019-11-30T17:16:57+05:30 IST