చేపల వేపుడు
ABN, First Publish Date - 2019-06-08T16:05:39+05:30
చేప - అరకేజీ, ఉప్పు - రుచికి తగినంత, కారం - అరటీస్పూన్, పసుపు - పావు టీస్పూన్, బియ్యప్పిండి - టీస్పూన్, మొక్కజొన్న పిండి - టీస్పూన్, అల్లం వెల్లుల్లి పేస్టు
కావలసినవి
చేప - అరకేజీ, ఉప్పు - రుచికి తగినంత, కారం - అరటీస్పూన్, పసుపు - పావు టీస్పూన్, బియ్యప్పిండి - టీస్పూన్, మొక్కజొన్న పిండి - టీస్పూన్, అల్లం వెల్లుల్లి పేస్టు - టీస్పూన్, జీలకర్రపొడి- పావు టీస్పూన్, నిమ్మరసం - టీస్పూన్, నూనె - తగినంత, పచ్చిమిర్చి - ఒకటి, కరివేపాకు - ఒకకట్ట, ఉల్లిపాయలు - రెండు, ధనియాల పొడి - పావు టీస్పూన్, కారం - అర టీస్పూన్, పసుపు - పావు టీస్పూన్, నిమ్మరసం - టీస్పూన్.
తయారీవిధానం
ముందుగా బియ్యప్పిండి, మొక్కజొన్న పిండి తీసుకొని అందులో కారం, ఉప్పు, పసుపు, అల్లంవెల్లుల్లి పేస్టు, జీలకర్ర పొడి, నిమ్మరసం వేసి బాగా కలియబెట్టాలి. చేపలను ముక్కలుగా కట్ చేసి శుభ్రంగా కడగాలి. తరువాత ఆ చేప ముక్కలకు మసాలా పట్టించి గంటపాటు పక్కన పెట్టుకోవాలి. తరువాత ఒక పాత్రలో నూనె పోసి, మసాల పట్టించిన చేప ముక్కలను వేగించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరొక పాన్‌లో నూనె వేసి కాస్త వేడి అయ్యాక పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కరివేపాకు వేసి వేగించాలి. ధనియాల పొడి, కారం, పసుపు, నిమ్మరసం వేయాలి. ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న చేప ముక్కలను వేసి కలపాలి. మరికాసేపు వేయించుకొన్న తరువాత నిమ్మరసం పిండుకుని స్టవ్ పైనుంచి దింపుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకోవాలి.
Updated Date - 2019-06-08T16:05:39+05:30 IST