ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చింతచిగురు బోటి

ABN, First Publish Date - 2019-05-04T20:02:17+05:30

బోటి - అరకేజీ, చింతచిగురు - కొద్దిగా, ఉల్లిపాయలు - రెండు, ఉప్పు - రుచికి తగినంత, నూనె - మూడు టీస్పూన్లు, కారం - టీస్పూన్‌, పసుపు - కొద్దిగా, పచ్చిమిర్చి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసిన పదార్థాలు
 
బోటి - అరకేజీ, చింతచిగురు - కొద్దిగా, ఉల్లిపాయలు - రెండు, ఉప్పు - రుచికి తగినంత, నూనె - మూడు టీస్పూన్లు, కారం - టీస్పూన్‌, పసుపు - కొద్దిగా, పచ్చిమిర్చి - నాలుగు, గరంమసాల - టీస్పూన్‌, కరివేపాకు - కట్ట, కొత్తిమీర - కట్ట, అల్లంవెల్లుల్లి పేస్ట్‌ - టీస్పూన్‌.
 
తయారుచేయు విధానం
 
ముందుగా కుక్కర్‌లో బోటిని ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. చింతచిగురును పేస్టు మాదిరిగా గ్రైండ్‌ చేసుకోవాలి. పాన్‌లో నూనె వేసి కాస్త వేడి అయ్యాక తరగిన ఉల్లిపాయలు వేసి వేగించుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకొని, పచ్చిమిర్చి వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఉడికించుకున్న బోటిని వేసి కలియబెట్టుకోవాలి. కాసేపయ్యాక అల్లం పేస్టు వేయాలి. కారం, గరంమసాలా, కరివేపాకు వేసి, కలపాలి. చివరగా చింతచిగురు పేస్టును వేయాలి. చిన్న మంటపై కాసేపు ఉంచి, కొత్తిమీర వేసి దింపుకోవాలి. నోరూరించే చింతచిగురు బోటి రెడీ.

Updated Date - 2019-05-04T20:02:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising