ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైఎస్‌ విగ్రహానికి 254 కోట్లా!: దేవినేని ఉమా

ABN, First Publish Date - 2020-11-19T09:16:15+05:30

‘‘పోలవరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్లిన మంత్రి అనిల్‌ ప్రాజెక్టు ఎత్తు తగ్గింపు, నీటి నిల్వ సామర్థ్యం తగ్గింపుపై రైతులకు, పరిహారం విషయంలో నిర్వాసితులకు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి, నవంబరు 18(ఆంధ్ర జ్యోతి): ‘‘పోలవరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్లిన మంత్రి అనిల్‌ ప్రాజెక్టు ఎత్తు తగ్గింపు, నీటి నిల్వ సామర్థ్యం తగ్గింపుపై రైతులకు, పరిహారం విషయంలో నిర్వాసితులకు సమాధానం చెప్పలేదు. కానీ... వైఎస్‌ విగ్రహం పెడతామని అర్భాటంగా ప్రకటించడం చిత్రంగా ఉంది. వైఎ్‌సఆర్‌ విగ్రహానికి రూ.98.87 కోట్లు, కాంప్లెక్స్‌ నిర్మాణానికి రూ.36.16 కోట్లు, అక్కడ అభివృద్ధికి రూ.36.16 కోట్లు, ల్యాండ్‌ స్కేపింగ్‌ కోసం రూ.8 కోట్లు.. ఇలా మొత్తం కలిపి రూ.254 కోట్లు ఖర్చుపెట్టేందుకు సిద్ధమయింది’’ అని మాజీ మంత్రి దేవినేని ఉమా విమర్శించారు.  గోదావరి జిల్లాల్లో వరద పరిహారం ఇవ్వని ప్రభుత్వం.. ఇప్పుడు వైఎస్‌ విగ్రహానికి అంత సొమ్ము ఖర్చు చేస్తాననడం ప్రజలను అవమానించడమేనన్నారు.  


జగన్‌ రావడమే పోలవరానికి శాపం.. రామానాయుడు 

జగన్‌ అధికారంలోకి రావడమే పోలవరం ప్రాజెక్టుకు శాపమైందని టీడీఎల్పీ ఉపనేత నిమ్మల రామానాయుడు విమర్శించారు. రివర్స్‌ టెండరింగ్‌తో రూ.750 కోట్లు ఆదా చేశామనడం పచ్చి అబద్ధమన్నారు. జగన్‌ పాలన తీరుతో పోలవరానికి రూ.7,500 కోట్లు నష్టం కలిగిందని ఆరోపించారు. 

Updated Date - 2020-11-19T09:16:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising