ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమరావతి ఖర్చు ఎంత?

ABN, First Publish Date - 2020-07-24T09:05:00+05:30

రాజధాని అమరావతి ప్రాజెక్టు మొత్తం అంచనా వ్యయం ఎంత? దీనిపై ఇప్పటిదాకా ఎంత ఖర్చు పెట్టారు? ఇంకా ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇప్పటికి ఎంత పెట్టారు?.. ఇంకా ఎంత పెట్టాలి?

అకౌంటెంట్‌ జనరల్‌ చెప్పాలి

ఆయనను ప్రతివాదిగా చేర్చండి

హైకోర్టు ధర్మాసనం ఆదేశం

తదుపరి విచారణ 6కు వాయిదా

ఈలోపే చట్టాలవుతాయేమోనన్న లాయర్‌

అదే జరిగితే మేం చూసుకుంటాం: హైకోర్టు


అమరావతి, జూలై 23 (ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతి ప్రాజెక్టు మొత్తం అంచనా వ్యయం ఎంత? దీనిపై ఇప్పటిదాకా ఎంత ఖర్చు పెట్టారు? ఇంకా ఎంత పెట్టాలి? దీనిపై అకౌంటెంట్‌ జనరల్‌ నుంచి స్పష్టత కావాలని రాష్ట్ర హైకోర్టు పేర్కొంది. ఇందుకు వీలుగా అకౌంటెంట్‌ జనరల్‌ను ప్రతివాదిగా చేర్చాలని పిటిషనర్‌ ‘రాజధాని రైతు పరిరక్షణ సమితి’కి సూచించింది.  న్యాయమూర్తులు జస్టిస్‌ రాకేశ్‌కుమార్‌, జస్టిస్‌ ఏవీ శేషసాయి, జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తితో కూడిన త్రిసభ్య ధర్మాసనం గురువారం ‘అమరావతి’ పిటిషన్లపై విచారణ జరిపింది. రాజధాని ప్రాజెక్టు ఖర్చుకు సంబంధించిన వివరాలను ఇప్పటికే కోర్టుకు సమర్పించామని అడ్వకేట్‌ జనరల్‌ ఎస్‌.శ్రీరాం పేర్కొనగా... ఆ వ్యవహారంపై ఇప్పటికిప్పుడు తామేమీ విచారణ జరపడం లేదని, అకౌంటెంట్‌ జనరల్‌ అందించే వివరాలను కూడా పరిశీలిస్తామని ధర్మాసనం వ్యాఖ్యానించింది. అకౌంటెంట్‌ జనరల్‌ను ప్రతివాదిగా చేర్చాలని పిటిషనర్‌ తరఫు న్యాయవాది అంబటి సుధాకరరావుకు సూచిస్తూ తదుపరి విచారణను ఆగస్టు 6వ తేదీకి వాయిదా వేసింది.


రాజధానిలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని, కార్యాలయాలు తరలిపోకుండా చర్యలు తీసుకోవాలని, రాజధానుల బిల్లు, సీఆర్డీయే రద్దు బిల్లును శాసనమండలి సెలక్ట్‌ కమిటీకి పంపినా, రెండోమారు శాసనసభలో ప్రవేశపెట్టడం... ఇలా అమరావతి వ్యవహారానికి సంబంధించిన మొత్తం 32 పిటిషన్లపై గురువారం ధర్మాసనం విచారణ జరిపింది. పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీయే చట్టం ఉపసంహరణ బిల్లులు సెలక్ట్‌కమిటీ ముందుకు పంపకపోవడాన్ని, ఆ రెండు బిల్లులు మళ్లీ శాసనసభలో ప్రవేశపెట్టడాన్ని సవాల్‌ చేస్తూ టీడీపీ ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లపై న్యాయవాది ఉన్నం మురళీధరరావు వాదనలు వినిపించారు. ‘‘సెలక్ట్‌ కమిటీ ఏర్పాటు విషయంలో అసెంబ్లీ కార్యదర్శి ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేస్తున్నారు. ఆ రెండు బిల్లుల్ని శాసనమండలి సెలక్ట్‌ కమిటీ ముందుకు పంపగా, మళ్లీ శాసనసభలో ప్రవేశపెట్టారు. ఇది చట్టవిరుద్ధం’’ అని ఆయన వివరించారు. ఈ పిటిషన్లపై ఆగస్టు 6వ తేదీన విచారణ జరుపుతామని ధర్మాసనం పేర్కొంది.


కౌంటర్‌ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈలోపు పాలన వికేంద్రీకరణ, సీఆర్డీయే రద్దు బిల్లులకు గవర్నర్‌ ఆమోదముద్ర వేసే అవకాశముందని, తద్వారా అవి చట్టాలుగా మారే అవకాశముందని పిటిషనర్‌ తరఫు న్యాయవాది సందేహం వ్యక్తం చేశారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ.. ఏదైనా న్యాయసమీక్షకు కట్టుబడే ఉంటుందని, అలాంటి పరిస్థితి తలెత్తితే తాము చూసుకుంటామని పేర్కొంది.


మరో న్యాయవాది డీఎ్‌సఎన్‌వీ ప్రసాద్‌బాబు వాదనలు వినిపిస్తూ..ప్రస్తుత హైకోర్టు భవనం అవసరాలకు తగినట్లుగా లేదని, శాశ్వత భవనం నిర్మించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని అభ్యర్థించారు. న్యాయవాది పీవీ కృష్ణయ్య వాదనలు వినిపిస్తూ.. 2014లో రాష్ట్ర విభజన జరగ్గా, అందుకు సంబంధించిన చట్ట నిబంధనలు ఇప్పటికీ అమలు కాలేదన్నారు. ఏపీ విభజన చట్ట నిబంధనల్ని సక్రమంగా అమలు చేయాలంటూ 2018లో దాఖలు చేసిన పిటిషన్‌పై ఇప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కౌంటర్లు దాఖలు చేయలేదని పేర్కొన్నారు. ఆయన వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. ఆ వ్యవహారంపై కౌంటర్లు దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. కాగా, ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల ప్రజల తరఫున దాఖలు చేసిన అనుబంధ పిటిషన్లను అనుమతించాలంటూ న్యాయవాదులు నాగిరెడ్డి, చంద్రశేఖర్‌ చేసిన అభ్యర్థనను ధర్మాసనం తిరస్కరించింది.


‘భూముల వేలం’పై విచారణ వాయిదా

అమరావతి, జూలై 23(ఆంధ్రజ్యోతి): విశాఖ, గుంటూరు జిల్లాల్లోని 9 చోట్ల ప్రభుత్వ భూముల వేలాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ ఈ నెల 29వ తేదీకి వాయిదా పడింది. ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్‌ అఫిడవిట్లు తమకు ఆలస్యంగా చేరాయని, వాటిపై రిప్లయ్‌ కౌంటర్‌ దాఖలు చేసేందుకు సమయం కావాలని పిటిషనర్ల తరఫు  న్యాయవాదుల అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ రాకేశ్‌కుమార్‌, జస్టిస్‌ బి.కృష్ణమోహన్‌లతో కూడిన ధర్మాసనం తదుపరి విచారణను వచ్చే బుధవారానికి వాయిదా వేసింది. భూముల వేలానికి సంబంధించి మే 28న జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను కూడా అప్పటి వరకూ పొడిగించింది.


ఆ 2 నెలల జీతాన్ని తప్పక చెల్లిస్తాం: ప్రభుత్వం

ఉద్యోగులకు మార్చి, ఏప్రిల్‌ నెలలకు సంబంధించిన పూర్తి జీతాలను తప్పకుండా చెల్లిస్తామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు వివరించింది. కొవిడ్‌-19 నేపథ్యంలో తలెత్తిన ఇబ్బందుల నుంచి కోలుకోగానే చెల్లిస్తామని తెలిపింది. ఈమేరకు ప్రభుత్వ న్యాయవాది సుమన్‌ హైకోర్టుకు తెలిపారు.

Updated Date - 2020-07-24T09:05:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising