ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్లాట్‌ఫాం టిక్కెట్టు: 50

ABN, First Publish Date - 2020-03-19T10:42:27+05:30

కరోనాను అరికట్టే చర్యల్లో భాగంగా దక్షిణ మధ్య రైల్వే ప్రధాన రైల్వేస్టేషన్లలో ప్లాట్‌ఫారం టిక్కెట్ల ధరలను పెంచేయడంతో దాని ప్రభావం ప్రత్యక్షంగా కనిపిస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 రైల్వే స్టేషన్‌కు తగ్గిన ప్రయాణికుల తాకిడి


గుంతకల్లు, మార్చి18: కరోనాను అరికట్టే చర్యల్లో భాగంగా దక్షిణ మధ్య రైల్వే ప్రధాన రైల్వేస్టేషన్లలో ప్లాట్‌ఫారం టిక్కెట్ల ధరలను పెంచేయడంతో దాని ప్రభావం ప్రత్యక్షంగా కనిపిస్తోంది. యా జమాన్య నిర్ణయంతో గుంతకల్లు రైల్వే స్టేషన్‌లో ప్లాట్‌ఫారం టిక్కెట్టు ధర రూ. 50లకు పెంచారు. దీంతో ప్రయాణికులు, వారితోపాటు స్టేషన్‌లోకి వచ్చేవారి సం ఖ్య గణనీయంగా తగ్గింది. దీనికితోడు టికెట్‌ చెకింగ్‌ సిబ్బంది ప్లాట్‌ఫారాలలోకి వచ్చేవారి వద్ద ఉన్న టిక్కెట్లను నిశితంగా తనిఖీ చేస్తుండటం, టిక్కెట్టులేని వారికి జరిమానాలు విధిస్తుండటంతో ప్లాట్‌ఫారాల్లోకి వచ్చేవారి సంఖ్య తగ్గింది. కరోనా విజృంభణ నేపథ్యంలో పక్క రాష్ట్రాల్లో కళాశాలలు, పరీక్షలు రద్దుకావడంతో వెళ్లడానికి బుక్‌చేసుకున్న టిక్కెట్లను ప్రయాణికులు రద్దుచేసుకుంటున్నారు.


ప్రయాణాలు చేయాల్సి ఉన్నా కరోనా ఎఫెక్ట్‌ కారణంగా భయంతో పునరాలోచనలో పడుతున్నారు. దీంతో గుంతకల్లు రైల్వే స్టేషన్‌లోని పీఆర్‌ఎస్‌ కౌంటర్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. రైల్వే ప్లాట్‌ఫారాలు, రెస్టురూములు, వెయిటింగ్‌ హాళ్ల వద్ద పారిశుధ్య కార్యక్రమాన్ని రైల్వే శాఖ ముమ్మరంచేసింది. కాగా ఏసీ బోగీల్లో ప్రయాణికులకు ఉలెన్‌ బ్లాంకెట్లను సరఫరాచేయకూడదని రైల్వే శాఖ నిర్ణయించింది. ప్ర స్తుతం కరోనా కారణంగా సెంట్రల్‌ రైల్వే, సదరన్‌ రైల్వే, దక్షిణమధ్య రైల్వే జోన్‌లోని తిరుపతి రైళ్లను రద్దుపరిచారు. త్వ రలో నైరుతి రైల్వేలో కూడా రైళ్లను రద్దుచేసే అవకాశముంది.

Updated Date - 2020-03-19T10:42:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising