ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆర్టీసీ సిబ్బంది నిజాయితీ

ABN, First Publish Date - 2020-03-23T10:02:07+05:30

ఏపీఎస్‌ ఆర్టీసీ(ప్రజారవాణాశాఖ) సిబ్బంది నిజాయితీ చాటుకున్నారు. వివరాలు ఇలా.. కదిరిలో ఆదివారం ఉదయం సుకన్య అనే మహిళ తన భర్త గురుప్రసాద్‌తో కలిసి చెన్నై- అనంతపురం సర్వీసు బస్సును ఎక్కారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతపురం టౌన్‌, మార్చి 22: ఏపీఎస్‌ ఆర్టీసీ(ప్రజారవాణాశాఖ) సిబ్బంది నిజాయితీ చాటుకున్నారు. వివరాలు ఇలా.. కదిరిలో ఆదివారం ఉదయం సుకన్య అనే మహిళ తన భర్త గురుప్రసాద్‌తో కలిసి చెన్నై- అనంతపురం సర్వీసు బస్సును ఎక్కారు. ఈ క్రమంలో వారు ముదిగుబ్బ సమీపంలోని రాళ్లఅనంతపురంలో దిగిపోయారు. అయితే బస్సులో ఆమె తన హ్యాండ్‌బ్యాగ్‌ మరచిపోయారు.

అందులో ఒక నల్లపూసల దండ, రెండు ఉంగరాలు, రెండు సెల్‌ఫోన్లు, రూ.29,500 నగదు ఉన్నాయి. ఈ బ్యాగును గుర్తించిన డ్రైవర్‌ హరికృష్ణ అనంతపురం బస్టాండ్‌లోని భద్రతా సిబ్బందికి అప్పజెప్పాడు. దీంతో అధికారులను ఆశ్రయించిన బాధితురాలు సుకన్య బంధువు అనిల్‌కుమార్‌ రెడ్డి సొమ్ములు ఉన్న బ్యాగును అందుకున్నారు. ఈ కార్యక్రమంలో బస్టాండు మేనేజర్‌ కేఎన్‌ మూర్తి, సీఐ శివకుమార్‌, కానిస్టేబుళ్లు ఫరీద్‌, వెంకటస్వామి, అదనపు డ్రైవర్‌ నరేష్‌ పాల్గొన్నారు.

Updated Date - 2020-03-23T10:02:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising