ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇది నేస్తం కాదు... కాపు ద్రోహం

ABN, First Publish Date - 2020-06-25T07:44:15+05:30

‘‘కాపు నేస్తం పథకం పేరుతో కాపులను ఆదుకుంటున్నామని వైసీపీ ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘కాపు లెక్క’లపై బహిరంగ చర్చకు సిద్ధమా: బొండా ఉమ


విజయవాడ, జూన్‌ 24(ఆంధ్రజ్యోతి): ‘‘కాపు నేస్తం పథకం పేరుతో కాపులను ఆదుకుంటున్నామని వైసీపీ ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోంది. అయితే దీనిని కాపు ద్రోహంగానే కాపు, తెలగ, బలిజ, ఒంటరి సామాజిక వర్గాల ప్రజలు భావిస్తున్నారు. ఏరు దాటాక తెప్ప తగలేసినట్లుగా వీరి విషయంలో వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. మీ మాటలతో, ఆర్భాటపు ప్రచారాలతో కాపుల కడుపు నిండదు. తప్పుడు లెక్కలతో మభ్యపెడితే నమ్మడానికి కాపులు పిచ్చివాళ్లు కాదని ప్రభుత్వ పెద్దలు గ్రహించాలి’’ అని టీడీపీ అధికార ప్రతినిధి బొండా ఉమామహేశ్వరరావు మండిపడ్డారు.


జగన్‌ పత్రికలో పేర్కొన్నట్లు రాష్ట్రంలో 2.36 లక్షల మందే కాపు మహిళలు ఉన్నట్లు ప్రభుత్వ పెద్దలు ఒప్పుకుంటున్నారా? అని ప్రశ్నించారు. ‘‘జగన్మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కాపు కార్పొరేషన్‌కు బడ్జెట్‌లో ఆర్భాటంగా రూ.2 వేల కోట్లు కేటాయించినట్లు చూిపించారు. పైగా కార్పొరేషన్‌ను నిర్వీర్యం చేసి టైపిస్టులకు జీతాలు ఇవ్వకుండా కార్పొరేషన్‌ ఆఫీసుకు తాళాలు వేశారు. సీఎం సొంత పత్రికకు ఇచ్చిన ప్రకటనలో పేర్కొన్న తప్పుడు లెక్కలపై రాష్ట్రంలో ఎక్కడైనా బహిరంగ చర్చకు సిద్ధం’’ అని బొండా సవాల్‌ విసిరారు.  

Updated Date - 2020-06-25T07:44:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising