ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డీలర్ల సమస్యలు పరిష్కరించాలి

ABN, First Publish Date - 2020-07-14T11:07:23+05:30

డీలర్ల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని ఆ సంఘం మండల అధ్యక్షుడు రామ్‌మోహన్‌ కోరారు. ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాల్మీకిపురం/చౌడేపల్లె/పుంగనూరు, కలకడ, జూలై 13: డీలర్ల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని ఆ సంఘం మండల అధ్యక్షుడు రామ్‌మోహన్‌ కోరారు. సోమవారం వాల్మీకిపురం మండల డీలర్లు తహసీల్దార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. దీనిపై స్పందించిన తహసీల్దార్‌ ఫిరోజ్‌ఖాన్‌.. కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లి తప్పక సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సంఘ మండల కార్యదర్శి సురేంద్రరెడ్డి, చౌక దుకాణ డీలర్లు పాల్గొన్నారు. చౌడేపల్లె మండల రేషన్‌ డీలర్లు కూడా తహసీల్దార్‌ మురళికి వినతిపత్రాన్ని అందించారు. పుంగనూరు మండల డీలర్ల సంఘ నాయకులు డీటీ రమేశ్‌కు వినతిపత్రాన్ని అందజేశారు.


డీలర్ల సంఘ అధ్యక్షుడు సుబ్రహ్మణ్యంరాజు, సంఘ నాయకులు ఖలీల్‌ అహ్మద్‌, గంగాధర్‌రెడ్డి, కేశవమూర్తి, రత్నప్ప, బసవరాజ, జాఫర్‌, జమీల్‌ తదితరులు పాల్గొన్నారు. పెండింగ్‌ కమీషన్‌ చెల్లించాలని కలకడ మండలం డీలర్ల సంఘం అధ్యక్షుడు సురేంద్రబాబు, ప్రధాన కార్యదర్శి మహేశ్వర్‌ రెడ్డి తదితరులు తహసీల్దార్‌ చిన్నయ్యకు వినతిపత్రం అందజేశారు. రేషన్‌ సరుకుల కమీషన్‌ చెల్లించాలని కలికిరి మండల చౌక దుకాణ డీలర్ల సంఘం నాయకులు సోమవారం తహసీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు. మండల డీలర్ల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు జయప్రకాష్‌, ఫరూక్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-07-14T11:07:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising