ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘తూర్పు’న కరోనా కల్లోలం

ABN, First Publish Date - 2020-05-10T08:08:29+05:30

కోయంబేడు మూలాలతో సత్యవేడు నియోజకవర్గంలో 9 పాజిటివ్‌ కేసులతో కరోనా కల్లోలం రేగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సత్యవేడు/నాగలాపురం/వరదయ్యపాళెం,  మే 9: కోయంబేడు మూలాలతో సత్యవేడు నియోజకవర్గంలో 9 పాజిటివ్‌ కేసులతో  కరోనా కల్లోలం రేగింది. నాగలాపురంలో ఐదు, సత్యవేడులో రెండు, వరదయ్యపాళెం ఒకటి, బీఎన్‌కండ్రిగ మండలంలో ఒకటి చొప్పున పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. చిన్న మండల కేంద్రమైన నాగలాపురంలో ఒక్కసారిగా ఐదుగురికి కరోనా సోకడంతో భయాందోళనలు నెలకొన్నాయి. రెడ్‌జోన్‌గా ప్రకటించిన అధికారులు.. నాగలాపురంతో పాటు అన్ని గ్రామాల్లో ఇంటింటి సర్వే చేపట్టారు.


మరోవైపు పాజిటివ్‌ వ్యక్తుల కుటుంబాలను, ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్‌లను గుర్తించి 50 మందికి ర్యాపిడ్‌ టెస్ట్‌లు నిర్వహించారు. 35మందిని వికృతమాల క్వారంటైన్‌కు తరలించారు. పారిశుధ్య పనులు ముమ్మరం చేశారు. సత్యవేడుతో పాటు మండలంలోని గంగమిట్టవీధి, కన్నావరం గ్రామాలను రెడ్‌జోన్‌లుగా ప్రకటించినట్లు ఎస్‌ఐ నాగార్జునరెడ్డి తెలిపారు. 50 మందిని క్వారంటైన్‌కు తరలించారు. ఎస్పీ సెంథిల్‌కుమార్‌, ఎమ్మెల్యే ఆదిమూలం, డీఎస్పీ మురళీధర్‌ రెడ్‌జోన్‌ ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. కంటోన్మెంట్‌ జోన్లలో ఇళ్లవద్దకే నిత్యావసర సరుకులను అందించాలన్నారు. వరదయ్యపాళెం మండలం కురింజలంలో పారిశుధ్య చర్యలు చేపట్టారు. 

Updated Date - 2020-05-10T08:08:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising