ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బాబా ముసుగులో రాసలీలలు

ABN, First Publish Date - 2020-08-01T10:34:49+05:30

కాళహస్తి పట్టణంలో బాబా ముసుగులో ఓ వ్యక్తి రాసలీలల సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పోలీసులను ఆశ్రయించిన బాధిత కుటుంబసభ్యులు


శ్రీకాళహస్తి, జూలై 31: శ్రీకాళహస్తి పట్టణంలో బాబా ముసుగులో ఓ వ్యక్తి రాసలీలల సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పూసలవీధికి చెందిన ఓ వ్యక్తి బాబా అవతారమెత్తి చేతబడులు చేస్తా.. పూజలతో ఉద్యోగాలిప్పిస్తానంటూ ప్రజలను నమ్మబలికాడు. ఈ క్రమంలో మహిళలను, యువతలను లోబర్చుకుని తన కామవాంఛను తీర్చుకుంటున్నాడు. తన కోరిక తీర్చకపోతే చేతబడి చేసి మీ కుటుంబాన్ని అంతం చేస్తానంటూ ఇద్దరు యువతులను బెదిరించాడు. భయబ్రాంతులకు గురైన ఆ యువతుల కుటుంబసభ్యులు గురువారం పోలీసులను ఆశ్రయించారు.


పోలీసులు సదరు బాబాను స్టేషన్‌కు తీసుకొచ్చి విచారించారు. వెంటనే అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడు రంగప్రవేశం చేసి కేసు నమోదు కాకుండా రాజీ ప్రయత్నం చేశారు. శుక్రవారం ఉదయం సమస్య ఒక కొలిక్కి వచ్చినట్లు తెలిసింది. ఆడబిడ్డల జీవితాలకు ఇబ్బంది కలుగుతుందేమోనని ఆ కుటుంబం రాజీకి అంగీకరించినట్లు చెబుతున్నారు. రాసలీలలకు పాల్పడుతున్న బాబాకు అధికార పార్టీ నేతలు అండగా నిలవడం చర్చనీయాంశంగా మారింది. ఆడపిల్లల జీవితాలతో ఆడుకుంటున్న బాబాపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. 

Updated Date - 2020-08-01T10:34:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising