వ్యవసాయ చట్టాలను రద్దు చేయాల్సిందే
ABN, First Publish Date - 2020-12-16T04:49:12+05:30
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులను రద్దు చేయాలని రైతు, ప్రజా సంఘాల నేతలు డిమాండు చేశారు.
తిరుపతిలో రైతుసంఘాల కొవ్వొత్తుల ప్రదర్శన
తిరుపతి (ఆటోనగర్), డిసెంబరు 15: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులను రద్దు చేయాలని రైతు, ప్రజా సంఘాల నేతలు డిమాండు చేశారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం తిరుపతిలో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. కార్పొరేషన్ కార్యాలయం నుంచి నాలుగు కాళ్ల మండపం వరకు ఈ ప్రదర్శన సాగింది. రైతుసంఘం జిల్లా అధ్యక్షుడు కుమార్‌రెడ్డి, సీపీఐ నగర అధ్యక్షుడు విశ్వనాథ్ మాట్లాడుతూ.. రైతులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులను రద్దు చేయాలంటూ ఎముకలు కొరికే చలిలోనూ ఢిల్లీలో వేలాది మంది రైతులు ఆందోళన చేస్తున్నారని గుర్తుచేశారు. వ్యవసాయ బిల్లులను పూర్తిగా రద్దుచేసేవరకు ఆందోళనలు కొనసాగుతాయని పేర్కొన్నారు. కేంద్రం ఇకనైనా కళ్లు తెరవాలని కోరారు. నాయకులు రాధాకృష్ణ, రాజా, శివ, నదియ, మంజుల, రత్నమ్మ, శశి, చలపతి, ఉదయ్, రామకృష్ణ, దాము, జయచంద్ర, చంద్రశేఖర్‌రెడ్డి, సాయిలక్ష్మి, లక్ష్మి, బుజ్జమ్మ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2020-12-16T04:49:12+05:30 IST